కాంగ్రెస్ లో చేరిన జూపల్లి

దిశ దశ, హైదరాబాద్:

పాలమూరు జిల్లా సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరారు. గురువారం న్యూ ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లాలో నెలకొన్న రాజకీయ సమీకరణాలతో పొసగక పోండంతో అధికార బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పాలనుకున్న క్రమంలో జూపల్లిని పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ అదిష్టానం సస్పెండ్ చేసింది. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నప్పటికీ పాలమూరు జిల్లాలోనే భారీ బహిరంగ సభ నిర్వహించాలనుకున్నారు. ఖమ్మం జిల్లా నేత పొంగులేటితో పాటు ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోవల్సి ఉన్నప్పటికీ తన సొంత జిల్లాలో బలం నిరూపించుకోవాలని భావించారు. కానీ అనూహ్యంగా ఏఐసీసీ అధిష్టానంతో పాటు ప్రియాంక గాంధీ వచ్చే అవకాశాలు లేవని చెప్పడంతో ఆయన న్యూ ఢిల్లీకి వెల్లి కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి వచ్చింది. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో తన ప్రాబల్యం చాటుకుని అధికార పార్టీకి సవాల్ విసరాలని భావించినప్పటికి అధిష్టానం పెద్దల బిజీ షెడ్యూల్ కారణంగా జాయినింగ్ విధానాన్ని మార్చుకోవల్సి వచ్చింది. జూపల్లితో పాటు మెగారెడ్డి, డాక్టర్ కూచుకుంట్ల రాజశేఖర్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డిలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ నేతలు కేసీ వేణుగోపాల్, మానిక్ రావు థాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page