అక్కడ వాంటెడ్… ఇక్కడ వెల్ కం…

కన్నారావు స్వాగత ఫ్లెక్సీల కలకలం

కరీంనగర్ లో ప్రత్యక్ష్యం

దిశ దశ, కరీంనగర్:

ఓ వైపున పోలీసులకు వాటెండ్ అయిన ఆయనకు స్వాగతం చెప్తూ ఫ్లెక్సీలు ప్రత్యక్ష్యం కావడం సంచలనంగా మారింది. ఓ కేసులో నిందితుడిగా ఉన్న ఆయన కోసం ఎల్ఓసీ జారీ చేస్తూ అక్కడ మాత్రం స్వాగతం చెప్తుండడం విచిత్రంగా మారింది. గతంలో అంతగా కనిపించని ఈ ఫెక్లీలు ఉన్నట్టుండి ఇప్పుడు ప్రత్యక్ష్యం కావడమే అందరినీ ఆశ్యర్యపరుస్తోంది.

క్రిమినల్ కేసులో

రంగారెడ్డి జిల్లా ఆధిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని భూమిని ఆక్రమించుకున్నాడంటూ బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కల్వకుంట్ల తేజేశ్వర్ రావు అలియాస్ కన్నారావు కూడా నిందితునిగా పేర్కొనడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కన్నారావు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కొడుకు కావడంతో పాటు గత కొంతకాలంగా ఈయన పేరు హైదరాబాద్ లో ప్రముఖంగా వినిపించింది. అయితే ఆయనపై కేసు నమోదు కావడంతో సంచలనంగా మారగా పోలీసులు కూడా అన్వేషణ కొనసాగించారు. కొంతకాలం బెంగుళూరులో ఉన్నాడన్నప్రచారం కూడా జరిగినప్పటికి ఆచూకి మాత్రం దొరకలేదు. ఈ అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు కన్నారావు సింగపూర్ వెళ్లిపోయాడని పోలీసులు గుర్తించినట్టు సమాచారం. దీంతో అంతర్జాతీయ విమానాశ్రయాల్లోకి ఆయన ఎంటర్ కాగానే అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుందని పోలీసులు లూక్ ఔట్ నోటీసులు ఇచ్చారని సమాచారం.

కరీంనగర్ లో ఫ్లెక్సీలు…

ఓ వైపున ఆధిభట్ల పోలీసులు కన్నారావు కోసం ఆరా తీస్తున్న క్రమంలో అనూహ్యంగా కరీంనగర్ లో ఫ్లెక్సీలు ప్రత్యక్ష్యం కావడం సంచలనంగా మారింది. కల్వకుంట్ల తేజేశ్వర్ రావు అలియాస్ కన్నారావుకు స్వాగతం… సుస్వాగతం అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మేడిశెట్టి వారి నూతన గృహ ప్రవేశం అంటూ పేర్కొనడంతో పాటు ఒక్క కన్నారావు ఫోటోలను మాత్రమే ఫ్లెక్సీల్లో ప్రింట్ చేయించారు. దీంతో కన్నారావు కరీంనగర్ కు వస్తున్నారా లేక కావాలనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారా అన్న చర్చ మొదలైంది. పరారీలో ఉన్నాడని పోలీసులు అన్వేషిస్తున్న క్రమంలో కన్నారావుకు స్వాగతం అంటూ ఫ్లెక్సీలు కరీంనగర్ లో ప్రత్యక్ష్యం కావడం వెనక ఆంతర్యం ఏంటన్నదే అంతుచిక్కడం లేదు. కరీంనగర్ లో వెలిసిన ఈ ఫ్లెక్సీల విషయం గురించి ఆరా తీసే పనిలో నిఘా వర్గాలు అలెర్ట్ అయినట్టు సమాచారం. గత పది రోజులుగా ఎవరికీ కనిపించని కన్నారావు ఫ్లెక్సీలు కరీంనగర్ లో వెలియడం ఏంటీ..? మేడిశెట్టి కుటుంబ సభ్యులకు కన్నారావుకు సంబంధం ఏంటీ అన్న కోణంలో కూడా ఆరా తీస్తున్నట్టు సమాచారం. అయితే ఈ ఫంక్షన్ ఆదివారం జరగడంతో ఆ కార్యక్రమానికి కన్నారావు వచ్చారా… రాలేదా..? అని ఆరా తీస్తున్నాయి ఇంటలీజెన్స్ వర్గాలు.

ఆయనతో టచ్ లో ఉన్నారా..?

కల్వకుంట్ల కన్నారావుతో జిల్లాకు చెందిన వారికి కూడా సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం ఇంతకాలం జరగడంతో పాటు గతంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు కూడా వచ్చి వెల్లినట్టుగా తెలుస్తోంది. అయితే స్వేచ్ఛగా తిరిగిన సమయంలో కూడా కన్నారావుకు స్వాగతం చెప్తూ ప్రత్యక్ష్యం కాని ఫ్లెక్సీలు ఇప్పుడు ఎందుకు ఏర్పాటు చేశారన్నది కూడా మిస్టరీగా మారింది. దీంతో కన్నారావుతో సంబంధాలు ఉన్న వారి వివరాల గురించి కూడా నిఘా వర్గాలు తెలుసుకునే పనిలో పడనున్నట్టుగా తెలుస్తోంది.

You cannot copy content of this page