ఏపీలో షాకింగ్ పరిణామం.. మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు

ఏపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదు అయింది. కోర్టు ఆదేశాల మేరకు సత్తెనపల్లి పోలీసులు అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు. సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ నేతలు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో టికెట్లు అమ్ముతున్నారని నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జనసేన నేతల ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయలేదు. దీంతో గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు గుంటూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు… అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని సత్తెనపల్లి పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు సత్తెనపల్లి పోలీసులు అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు. ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్కులేషన్ స్కీమ్స్ నిషేధ చట్టం కింద అంబటి రాంబాబుపై సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఏకంగా మంత్రిపై పోలీసులు కేసు నమోదు చేయడంతో.. ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. సంక్రాంతి డ్రా పేరుతో ప్రతి ఏడాది అంబటి రాంబాబు నియోజకవర్గంలో లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. దీని కోసం నియోజకవర్గ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. లక్కీ డ్రా కూపన్ కోసం ఒక్కొక్కరి నుంచి రూ.100 వసూలు చేస్తున్నారు. సత్తెనపల్లి వైసీపీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అధికారంగా నిర్వహిస్తున్నారు. అయితే లక్కీ డ్రా నిర్వహించడం నిబంధనలకు విరద్దమని జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రతి ఏడాది సంక్రాంతి లక్కీ డ్రా నిర్వహిస్తుండగా..ఎప్పుడూ వివాదాస్పదం కాలేదు. కానీ ఈ సారి వివాదం రేపుతోంది. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు.. అంబటి రాంబాబుపై తదుపరి చర్యలు తీసుకుంటారా.. లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. మంత్రి కదా అని పట్టించుకోకుండా వదిలేస్తారా లేదా చర్యలు తీసుకుంటారా అని సత్తెనపల్లి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ కేసులో పోలీసుల తరుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది.

You cannot copy content of this page