దిశ దశ, న్యూఢిల్లీ:
లోకసభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ షెడ్యూల్ విడుదల చేసిన తరువాత ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్రాల్లో పని చేస్తున్న ఉన్నతాధికారులను విధుల నుండి తప్పించడంతో కలకలం లేచింది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరఖండ్ రాష్ట్రాలకు చెందిన హోం సెక్రటరిలను తొలగిస్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. మిజోరాం, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన జనలర్ అడ్మినిస్ట్రేషన్ విభాగం కార్యదర్శిని కూడా తొలగించింది. పశ్చిమ బెంగాల్ డీజీపీని కూడా విధుల నుండి తప్పించింది.