ఒకే ఒక్కడు సినిమాను మరిపిస్తున్న ఎమ్మెల్యే… వినూత్న నిర్ణయాలతో సంచలనాలకు కేరాప్…

దిశ దశ, కామారెడ్డి:

ర్నలిస్టుగా ఉన్న అర్జున్ అనూహ్య పరిణామాల్లో సీఎం అయి రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన తీరుపై తీసిన ఒకె ఒక్కడు సినిమా  కథనాన్ని మరిపిస్తున్నారా ఎమ్మెల్యే. కాకపోతే మూవీలో జర్నలిస్టు రోల్ పోషించిన అర్జున్ సీఎం చాలెంజ్ విసరడంతో ముఖ్యమంత్రి కుర్చీలో కుర్చున్నారు. ఇక్కడ మాత్రం పొలిటిషియన్ గా ఉన్న ఈయన ముఖ్యమంత్రి అభ్యర్థులిద్దరిని ఓడించి సంచలనం సృష్టించారు. గెలిచిన తరువాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం ఆ ఒకె ఒక్కడు సినిమాలో చూపించిన తీరునే తలపిస్తున్నాయి.

సంచనాలకు కేరాఫ్…

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయడమే ఓ సాహసమైన నిర్ణయమనే చెప్పాలి. 2018 ఎన్నికల్లో ఆయన 15 వేల ఓట్లు సాధించుకుని మూడో స్థానంతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నిలిచిన ఆయన దేశంలోనే అరుదైన చరిత్రను క్రియేట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కేసీఆర్ లపై ఆయన నిలబడేందుకు సాహసించారు. ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఇక్కడి నుండి పోటీ చేయడంతో దేశ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఉద్దండులపై విజయం సాధించి వెంకట రమణారెడ్డి సంచలనం సృష్టించారు. అయితే ఆయన విజయం వరకే సంచలనాలు నమోదు చేయడంతో సరిపెట్టకుండా ఎన్నో వైవిద్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజా క్షేత్రంలో అందరి నోట భేష్ అనిపించుకుంటున్నారు.

ఇంటిని కూల్చి…

పాత బస్ స్టేషన్ మీదుగా కలెక్టరేట్ కు వెల్లే దారి ఇరుగ్గా ఉండడంతో పాటు మాస్టర్ ప్లాన్ లో కూడా రోడ్డు వెడల్పు చేయాలన్న ప్రతిపాదన కూడా వచ్చింది. అయితే ఈ రహదారిలో కాటిపెల్లి వెంకట రమణారెడ్డితో పాటు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఇండ్లు థియేటర్లు కూడా ఉండడంతో రోడ్డు వెడల్పు కావడం అసాధ్యమని భావించారంతా. తాజాగా జరిగిన ఎన్నికల్లో వెంకట రమణా రెడ్డి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందడంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న చర్చ కూడా సాగింది. వారం రోజుల క్రితం అనూహ్యంగా ఎవరూ ఊహించని విధంగా వ్యవహరించి సంచలన నిర్ణయం తీసుకున్నారాయన. రహదారి మొదట్లోనే ఉన్న తన ఇంటిని కూల్చివేసేందుకు దగ్గరుండి బుల్లోజర్లను పెట్టించి రోడ్డు వెడల్పునకు మార్గం సుగమం చేశారు. దీంతో అధికారులు ఆ ప్రాంతంలో రోడ్డు వెడల్పు చేసేందుకు నడుం బిగిస్తున్నారు. తాజాగా మరో నిర్ణయం కూడా తీసుకున్నా కాటిపెల్లి వెంకట రమణారెడ్డి ఊరూరా బాక్సులు ఏర్పాటు చేయబోతున్నారు. ఫిర్యాదుల పెట్టెలను గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ఎమ్మెల్యే ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన వివరాలను రాసి ఆ బాక్సుల్లో వేసినట్టయితే వాటిని పరిష్కరించేందుకు చొరవ చూపిస్తానని ఎమ్మెల్యే చెప్తున్నారు. క్షేత్ర స్థాయ సమస్యలు తెలుసుకోవడంలో భాగంగానే ఎమ్మెల్యే ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. నిజమైన భూ బాధితులు ఉన్నట్టయితే తనను నేరుగా వచ్చి కలవాలని వారికి బాసటగా ఉండి ఆక్రమించుకున్న వారు ఎంతటి వారైనా వదిలిపెట్టనని గతంలోనే ప్రకటించారు ఎమ్మెల్యే. ఇలా సామాన్యులకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్న వెంకట రమణా రెడ్డి సంచలన నిర్ణయాలకు కేంద్ర బిందువుగా మారిపోయారు.

You cannot copy content of this page