కవితక్కకు పాదాభివందనం…

కరీంనగర్ లో సోమవారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు చర్చనీయాంశంగా మారాయి. సాక్షాత్తు సహాయ మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఎమ్మెల్సీ కి పాదాభి వందనం చేయగా, మరో వైపున విద్యార్థిచే నాయకులు కవితక్కకు కాళ్లు మొక్కించారు. లైవ్ ప్రోగ్రాం కొనసాగుతున్న విషయం మరిచి మరీ బీఆర్ఎస్ నాయకులు వెనకా ముందు ఆలోచించకుండా కవితక్కకు కాళ్లు మొక్కాలని విద్యార్థికి చెప్పి పాదాభి వందనం చేయించడంపై నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపున కరీంనగర్ జడ్పీ ఛైర్ పర్సన్ కనుమల్ల విజయ కూడా సన్మానం జరిగిన అనంతరం ఎమ్మెల్సీ కవితకు పాదాభివందనం చేశారు.


You cannot copy content of this page