దిశ దశ, హైదరాబాద్:
హాలిడే ట్రిప్ హైదరాబాద్ లో ఎంజాయ్ చేద్దాం… హైటెక్ సిటీ ఎలా ఉందో చూసొద్దాం… ఔటర్ పై అలా షికారు కెల్దాం అని టూర్స్ ప్లాన్ చేసుకునే వారు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. భాగ్యనగరానికి వెల్లే టూరిస్టులు అక్కడి హోటళ్లలోని సొబగులు చూసి మైమరిచిపోయి తినే ముందు ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న వరస దాడుల గురించి తెలుసుకోవల్సిందే. లేనట్టయితే ఔట్ డేటెడ్ మెటిరియల్ తో తయారు చేసిన ఫుడ్ తిని ఆసుపత్రి పాలు కావడం ఖాయం. ప్రైమ్ లోకోషన్స్ లోని హోటల్స్ పై ఇటీవల జరిపిన సోదాల్లో వెలుగులోకి వచ్చిన విషయాలు షాకిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యాన్ని పంచే ఆహారం కోసం ఆరా తీసి మరీ వెల్లి ఫుడ్ ఆర్డర్ ఇవ్వండి కానీ కాస్ట్లీ హోటల్ లో క్లారిటీ ఉంటుందని నమ్మితే మాత్రం ఆసుపత్రి పాలు కావడం ఖాయం.
వరస దాడులు…
హైదరాబాద్ మహానగరంలో గడత కొద్ది రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు జరుపుతున్న దాడులతో వెలుగులోకి వస్తున్న విషయాలు అందరినీ భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఎక్కడో ఉద్యోగం చేస్తూ అల్లంత దూరాన ఇంటికి వెల్లి భోజనం చేయడం ఇబ్బందని భావించి హోటల్స్ లో భోజనం చేస్తుంటారు. వీరితో పాటు దేశ విదేశాల నుండి వచ్చే టూరిస్టులు కూడా హైదరాబాద్ ఫుడ్ పై మక్కువతో క్లాస్ గా కనపడుతున్న హోటల్స్ లో ఫుడ్ తీసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేసినప్పుడు వెలుగులోకి వచ్చిన విషయాలు ఆందోళణకు గురి చేసే విధంగా ఉన్నాయి. రామేశ్వరం కేఫ్ లాంటి హోటల్స్ లో కూడా గడువు ముగిసిన మెటిరియల్ వాడుతూ ఫుడ్ తయారు చేస్తున్నారని గుర్తించారు ఫుడ్ సేఫ్టీ వింగ్ అధికారులు వరస దాడులతో మహానగరం హోటల్లలో జరుగుతున్న తీరు గురించి బయటపడుతున్న తీరును గమనించి అయినా జాగ్రత్తలు తీసుకోవల్సిన ఆవశ్యకత ఉంది. నిభందనలు అతిక్రమించిన హోటళ్లకు ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు కూడా ఇస్తుండగా కొన్నింటిని మూసివేయాలని కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో చాలా మంది టూరిస్టులు తమ పిల్లలను తీసుకుని హైదరాబాద్ టూర్ ప్లాన్ చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇలాంటి హోటల్స్ లో ఫుడ్ తీసుకున్న తరువాత చిన్నపిల్లలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉన్నందున హైదరాబాద్ కు వెల్లే టూరిస్టులు ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకున్న తరువాతే హోటల్స్ లో అడుగు పెట్టడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవల చేసిన దాడులకు సంబందించిన సమగ్ర సమాచారం కోసం ఆ శాఖకు చెందిన ‘‘ఎక్స్’’ అకౌంట్ ను ఓపెన్ చేసి చూడండి వాస్తవాలు తెలుస్తాయి.
https://x.com/cfs_telangana/status/1794007016937312619