ఉప్పల్​ స్టేడియంలో ఏడు మ్యాచ్​లు

మూడేళ్ల తరువాత ఐపీఎల్

మూడేళ్ల తర్వాత హైదరాబాద్​లో ఐపీఎల్​ సందడి నెలకొననుంది. క్రికెట్​ ఫ్యాన్ప్ కు ఆనందాన్ని పంచే క్షణలు చేరువయ్యాయి. హైదరాబాద్ మహానగరంలో టీ20 ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లకు మూడేళ్లుగా మోక్షం లేకుండా పోయింది. ఉప్పల్ స్టేడియంలో మ్యాచులు ఎప్పుడు జరుగుతాయోనని ఎదరుచూస్తున్న వారికి సంతోషకరమైన వార్త అందినట్టయింది. 16వ ఐపీఎల్ సీజన్​ షెడ్యూల్ మార్చి 31వ నుండి మే 28వ వరకు సాగనుంది. ఈ మేరకు బీసీసీఐ శుక్రవారం సాయంత్రం షెడ్యూల్ విడుదల చేసింది. గుజరాత్​ టైటాన్స్​, చెన్నై సూపర్​ కింగ్స్​ మధ్య మ్యాచ్​తో 2023 ఐపీఎల్​ సందడి మొదలుకానుంది. మూడేళ్లుగా మ్యాచులకు దూరంగా ఉన్న ఉప్పల్ స్టేడియంలో కూడా ఏడు మ్యాచులకు అవకాశం ఇవ్వడంతో ఫ్యాన్స్​ సంతోషంలో మునిగితేలుతున్నారు. సన్​రైజర్స్​​ జట్టు ఏడు మ్యాచులు హైదరాబాద్​లో ఆడనుండగా మరో ఏడు మ్యాచ్​లు ఇతతర రాష్ట్రల్లో ఆడనుంది. గ్రూప్​-బిలో ఉన్న ఎస్​ఆర్​హహెచ్ తన తొలి మ్యాచ్​లో రాజస్థాన్​ రాయల్స్​తో ఏప్రిల్​ 2న హైదరాబాద్​లో జరగనుంది. అహ్మదాబాద్​ వేదికగా గుజరాత్ టైటాన్స్​, చెన్నై సూపర్​ కింగ్స్​ టీమ్ సీజన్​ స్టార్ట్ చేయనున్నాయి. తొలి మ్యాచ్ జరిగిన చోటే మే 28న ఆఖరి మ్యాచ్​ జరగనుంది. 52 రోజుల పాటు జరగనున్న ఈ సీజన్​లో మొత్తం 70 మ్యాచులు ఉంటాయని, వీక్​ డేస్​లో రోజుకో మ్యాచ్, శని, ఆదివారాల్లో రెండు మ్యాచుల చొప్పున నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సీజన్​లో మొత్తం 18 డబుల్ హెడర్‌లు ఉండగా డే గేమ్‌లు మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలుకానున్నాయి. ఈవెనింగ్​ మ్యాచ్​లు సాయంత్రం 07:30 గంటలకు ప్రారంభమవుతాయని షెడ్యూలో లో పేర్కొన్నారు.

You cannot copy content of this page