రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ…

దిశ దశ, హైదరాబాద్:

తెలంగాణాలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీ అనిల్ కుమార్ పోలీస్ పర్సనల్ అడిషనల్ డీజీగా, రామగుండం సీపీ ఎం శ్రీనివాసులు సీఐడీకి, వరంగల్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా రామగుండం సీపీగా, సూర్యపేట ఎస్పీ సుప్రీత్ సింగ్ వరంగల్ కమిషనర్ గా, పెద్దపల్లి డీసీపీ చేతన సూర్యపేట ఎస్పీగా, కామారెడ్డి ఎస్పీ సింధూ శర్మ ఇంటలీజెన్స్ విభాగానికి, యాదాద్రి డీసీపీ ఎం రాజేష్ చంద్ర కామారెడ్డి ఎస్పీగా, తెలంగాణ నార్కోటిక్ విభాగంలో ఎస్పీగా పని చేస్తున్న పోతరాజు సాయి చైతన్య నిజామాబాద్ కమిషనర్ గా, ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా, సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్ ఎస్పీగా, సంగారెడ్డి ఎస్పీ రూపేష్ నార్కోటిక్ విభాగానికి బదిలీ అయ్యారు. సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదాద్రి డీసీగా, కొత్తగూడెం ఓఎస్డీ పరితోష్ పంకజ్ సంగారెడ్డి ఎస్సీగా, ములుగు ఓఎస్డీ మహేష్ బాబా సాహెబ్ సిరిసిల్ల ఎస్పీగా, అంకిత్ కుమార్ వరంగల్ డీసీపీగా, ఏ భాస్కర్ మంచిర్యాల డీసీపీగా, సూర్యపేట ఎస్పీ నర్సింహ, శిల్పావలి సెంట్రల్ జోన్ డీసీపీగా, సాయి శేఖర్ ఎస్ఐబీ ఎస్పీగా, పి కరుణాకర్ పెద్దపల్లి డీసీపీగా, రవిందర్ సీఐడీ ఎస్పీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 

You cannot copy content of this page