బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ రీఎంట్రీ ఇచ్చిన సినిమా ‘పఠాన్’. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడులవ్వబోతుంది. ఇంత వరకు ఏ సినిమాకు లేని విధంగా ఎక్కువ థియేటర్లలో విడుదలవుతున్న మొట్ట మొదటి భారతీయ సినిమాగా ఈ సినిమా నిలిచింది. జనవరి 25న విడులవ్వబోతున్న ” పఠాన్ ” సినిమా 100కు పైగా దేశాల్లో విడులవ్వడం విశేషం. కేవలం ఓవర్సిస్‌లోనే 2500 కంటే ఎక్కువ స్క్రీన్స్‌లో విడులవ్వబోతుంది. ఈ క్రమంలో బ్రిటిష్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ క్లాసిఫికేషన్ .. ‘పఠాన్’ సినిమాకు 12A రేటింగ్ ఇచ్చింది. ఇది సినిమాలోని వయొలెన్స్, థ్రెట్స్‌కు సంబంధించిన కొన్ని సీన్స్ గురించి హింట్స్ ఇస్తుంది.
ఇక పఠాన్’ సినిమా కథ విషయానికొస్తే.. డేంజరస్ సింథటిక్ వైరస్ అంతం చేసేందుకు ఒక అండర్ కవర్ కాప్, మాజీ నేరస్తుడుతో కలిసి నిర్వహించే మిషన్ మీద కథ తీరుతుందట . మొత్తం 2 గంటల 26 నిముషాలు నిడివి గల యాక్షన్ సినిమా గురించి BBFC వాళ్ల వెబ్‌సైట్‌లో కొన్ని వివరాలను వెల్లడించింది. గాయాలు, థ్రెట్స్, హర్రర్, వయొలెన్స్‌కు సంబంధించి పలు హెచ్చరికలు ముందే తెలియజేసింది. ఈ సినిమాలోని పాత్రలు డేంజరస్ వైరస్ బారిన పడినప్పుడు వారి ముఖమంతా చూడటానికి కూడా భయంకరంగా ఉంటుందట.
యాక్షన్ సినిమా కావడంతో వయొలెన్స్‌కు సంబంధించి కొన్ని హెచ్చరికలను BBFC వెబ్‌సైట్లో షేర్ చేసింది. ఒకరినినొకరిని కాల్చుకోవడం , కత్తులతో పొడుచుకోవడం , గొంతు కోయడాలు, పేలుళ్లు వంటి ఇలా హింసాత్మక సన్నివేశాలు సినిమాలో చాలానే ఉన్నాయని తెలిపింది . అలాగే ఈ సినిమా నుంచి ఒక సీన్‌ను తొలగించారని ఆ సీన్ ఏదో ఇంకా రివీల్ చేయలేదు. మన దేశంలో ‘పఠాన్’ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ UA సర్టిఫికెట్ ఇచ్చింది. దీనిలో దీపికా పదుకొనె చాలా క్లోజప్ షాట్స్ చాలానే ఉన్నాయట. ఈ సినిమాలో జాన్ అబ్రహం విలన్ రోల్లో నటించాడు.