గుర్తులూ ఆయనవే
ఈసీఐ షాకింగ్ డెసిషన్
మాహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేకు భారత ఎన్నికల కమిషన్ షాకింగ్ న్యూస్ చెప్పింది. వారసత్వంగా తండ్రి నుండి పగ్గాలు చేపట్టి పార్టీని కాపాడుకుంటూ వచ్చిన ఉద్దవ్ ఇక శివసేనను వదులుకోక తప్పేలా లేదు. గుర్తులు కూడా వదిలేసుకుని పార్టీ పేరు కొత్తది పెట్టుకుని కొత్త గుర్తులు వెతుక్కునే పనిలో పడాల్సి వచ్చింది ఈసీఐ కొత్తగా తీసుకున్న నిర్ణయంతో.
షిండేదే…
మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేదే అసలైన శివసేన పార్టీ అని ఈసీఐ అధికారికంగా గుర్తించడంతో పాటు పార్టీ గుర్తు ధనుస్సు, బాణం కూడా షిండే వర్గానికే కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. శివసేనలో సంక్షోభం ఏర్పడి అసమ్మతి వర్గం నేత ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అసలైన శివసేన పార్టీ తమదంటే తమదని ఏక్ నాథ్ షిండే, ఉద్ధవ్ థాక్రేలు ప్రకటించుకున్నారు. ఈ విషయంలో తాము నిర్ణయం తీసుకుని అధికారికంగా వెల్లడించే వరకూ షిండే, థాక్రేలు తాత్కలికంగా వేర్వేరు గుర్తులు ఉపయోగించుకోవాలని ఈసీఐ సలహా ఇచ్చింది. తాజాగా ఈసీఐ తీసుకున్ననిర్ణయంతో సీఎం ఏక్ నాథ్ షిండేకు వర్గంలో ఆనందం వ్యక్తం అవుతుండగా ఉద్దవ్ వర్గం ఆందోళనకు గురవుతోంది.
ప్రామాణికం ఇదే: ఈసీఐ
శివసేన ఎవరిదో అధికారింగా వెల్లడించేందేకు తాము తీసుకున్న ప్రామాణికత విషయాన్ని కూడా ఈసీఐ వెల్లడించింది. 2019 ఎన్నికల్లో శివసేన పార్టీ తరఫున గెలిచిన 55 మంది ఎమ్మెల్యేలు 76 శాతం ఓటింగ్ సాధించారని, వారందరి మద్దతు ఏక్ నాథ్ షిండేకు ఉందని వివరించింది. అటు, ఉద్ధవ్ థాకరే వర్గం ఎమ్మెల్యేలకు 23.5 శాతం మాత్రమే ఓటింగ్ లభించిందని ఈ కారణంగానే షిండేకు శివసేన, ఆ పార్టీ గుర్తులను కెటాయించినట్టు వివరించింది.
నికార్సయిన శివసైనికులం: సీఎం షిండే
అసలైన శివసేన పార్టీ తమదేనని గుర్తించడంపై మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండ్ స్పందించారు. శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాక్రే భావజాలం సాధించిన విజయమని అభివర్ణించారు. ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలుపిన ఆయన ప్రజాస్వామ్యంలో మెజారిటీనే ప్రాతిపదికగా తీసుకుంటారని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఈసీఐ నిర్ణయంతో తమదే నికార్సయిన శివసేన అని తేలిందన్నారు. బాలాసాహెబ్ సిద్ధాంతాలను దృష్టిలో ఉంచుకునే తాము (బీజేపీతో కలిసి) గతేడాది మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని షిండే వివరించారు.
ఇందిరమ్మకే తప్పలే: పవార్
శివసేన పార్టీ షిండే వర్గానిదేనని ఈసీఐ ప్రకటించిన నేఫథ్యంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. గతంలో ఇందిరాగాంధీకే ఇలాంటి పరిస్థితి ఎదురైందని, శివసేన చీఫ్ ఉధ్దవ్ థాక్రే ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పార్టీ పేరు, సింబల్ ఎంపిక చేసుకుని ముందుకు సాగాలని సలహా ఇచ్చారు.