దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ కు పర్యాటక శోభ తీసుకరాబోతున్న తీగల వంతెన ప్రారంభానికి ముందే మూవీ షూటింగ్ స్పాట్ గా మారిపోయింది. కళల కాణాచి కరీంనగరానికి చెందిన కళాకారులు తమకు మరో షూటింగ్ స్పాట్ అందుబాటులోకి రానుందని సంబరపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో తుది మెరుగులు దిద్దుకుంటున్న తీగల వంతెనపై అప్పుడే షూటింగ్ తీయడం ఆరంభిచారు కళాకారులు. ప్రముఖ దర్శకుడు మధుసూధన్ రెడ్డి దర్శకత్వంలో నిర్మిస్తున్న కామెడీ ఓరియంటెడ్ మూవీకి సంబంధించిన కొంతమేర షూటింగ్ శనివారం జరిగింది. హీరో, హీరోయిన్ల చే పాటను కూడా చిత్రీకరించే పనిలో నిమగ్నం అయింది సినిమా యూనిట్.



