పాన్ కార్డు అనేది ప్రతిఒక్కరికీ ముఖ్యం. ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డు కూడా తప్పనిసరిగా అందరికీ ఉండాల్సిన గుర్తింపు కార్డుగా మారిపోయింది. నగదు లావాదేవీలకు పాన్ కార్డు అనేది తప్పనిసరి. బ్యాంకులో రూ.50 వేలకుపైగా డబ్బులు డ్రా చేయాలంటే పాన్ కార్డు అవసరం. ఇక ఆధార్ కార్డు లేని సమయంలో చాలా పనులకు పాన్ కార్డు గుర్తింపు పత్రంగా ఉపయోగపడుతుంది. ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ లేదా మీరు ఉద్యోగం చేసే సంస్థలో శాలరీ పొందాలన్నా పాన్ కార్డు అనేది తప్పనిసరిగా అవసరం.
అయితే పాన్ కార్డులో తప్పులు పడితే చాలా సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. దీంతో తప్పులు ఉంటే మార్చుకోవాలి. అప్పుడు పాన్ కార్డును ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. అయితే పాన్ కార్డులో తప్పులు పడితే ఎలా మార్చుకోవాలనే విషయం చాలామందికి తెలియదు. ఎక్కడికి వెళ్లాలి.. ఎవరిని సంప్రదించాలి అనే విషయం తెలియక తప్పులు సరిద్దిదుకోకుండా అలాగే ఉంటారు. ఇంట్లోని ఉండి ఆన్ లైన్ ద్వారా మార్చుకోవచ్చు. అలాగే ఆఫ్ లైన్ ద్వారా మార్చుకునే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
పేరు తప్పుగా పడటం, కార్డుపై మీ ఫొటోకి బదులు వేరేవారి ఫొటో పడటం, ఫొటో సరిగ్గా పడకపోవడం, కార్డు ఇంటికి డెలివరీ కాకపోవడం, పుట్టిన తేదీ, తండ్రి పేరు తప్పుగా పడటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఆన్ లైన్ ద్వారా మార్చుకోవాలంటే.. ఆదాయపు పన్ను వెబ్ సైట్ లోకి వెళ్లి పన్ను చెల్లింపుదారులు ట్యాబ్ పై క్లిక్ చేయాలి. తర్వాత పాన్ గ్రీవెన్స్ సెక్షన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత పేరు, పాన్ నెంబర్, వ్యక్తిగత వివరాలు, ఈ మెయిల్ వివరాలులు ఇచ్చి దరఖాస్తు చేయాలి.
అలాగే TIN pROTEAN eGov టెక్నాలజీస్ లిమిటెడ్ పోర్టల్ ను సందర్శించాలి. అందులో కస్టమర్ కేర్ సెక్షన్ కు వెళ్లి కంప్లైంట్ దరఖాస్తు ఫారం క్లిక్ చేసి పూర్తి చేయాలి. ఆ తర్వాత ఫారం పూర్తి చేసిన తర్వాత క్యాప్చా కోడ్ ను ఎంటర్ చేసి ఫారం సబ్మిట్ చేయాలి. అలాగే ఆఫ్ లైన్ ద్వారా మార్చుకోవాలంటే. 18001801961 లేదా 91 2027218080కి ఫిర్యాదు చేయాలి.