పండగ నాడూ ఫైన్లు తప్పవా..?

తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం నాడూ నో ఎగ్జెమ్షన్ అంటున్నారు పోలీసులు. ఏ రోజైనా రూల్ రూలే అంటూ నిభందనలు క్రాస్ చేసిన వారికి ఫైన్లు వేస్తూనే ఉన్నారు. పండగ కోసం ఇంట్లో అవసరాల కోసం బయటకు రాగానే పోలీసులు తమ మూడో కన్ను తెరుస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, హెల్మెట ఇలా ఆర్టీఏ నిభందనలకు విరుద్దంగా వ్యవహరించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. స్పెషల్ డే అయినా కామన్ డే అయినా పబ్లిక్ సేఫ్టీ ముఖ్యం కదా సార్ అంటూ పోలీసులు సమధానం ఇస్తున్నారు. మరో వైపున కొన్ని ప్రాంతాల్లో పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ ప్రోగ్రాం కూడా చేపట్టారట పోలీసులు. నిభందనల ప్రకరాం అన్ని డాక్యూమెంట్లు ఉండడం వల్ల వాహనదారులకు కూడా మంచిదని, ఒక వేళ ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ క్లైయిమ్ చేసుకునే అవకాశం ఉంటుందన్న విషయం గుర్తు పెట్టుకోవాలని పోలీసులు అంటున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉగాది పర్వదినం రోజున కూడా ఫైన్ల వేటలో పోలీసులు నిమగ్నం కావడం గమనార్హం. దీంతో వెహికిల్ వాలాలు పోలీసుల తనిఖీలను గమనించి తమ వద్ద ఉన్న అన్ని రకాల డాక్యూమెంట్లు ఉన్నాయో లేవో క్రాస్ చేసుకుంటూ పోలీస్ చెకింగ్ పాయిట్ల మీదుగా వెల్తున్నారు. లేనట్టయితే పోలీసులు వేసే ఫైన్లు కట్టక తప్పదని… అసలే తొలి పండగ రోజున జరిమానాలు కట్టడం అవసరమా అని అంటున్నారు వాహనదారులు.

కారణమిదేనా..?

అయితే ఎంవీ యాక్టు అమలు చేస్తున్న పోలీసులు కఠినంగా వ్యవహరించడం వెనక కారణం వేరే ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున రాష్ట్ర ఖజానలోకి పెండింగ్ బిల్లులు కలెక్షన్ చేసి జమ చేయాలన్న లక్ష్యంతో పాటు, ఎంవీ యాక్టు నిభందనలు పాటించని వారిపై ఫైన్లు వేయడం వల్ల తమ లక్ష్యాలు కూడా చేరుకుంటామన్న కారణంగానే పోలీసు అధికారులు అందివచ్చిన అవశాన్ని వదిలిపెట్టడం లేదని అంటున్నారు. కొందరు.

You cannot copy content of this page