పురుమళ్లకు షోకాజ్ నోటీస్

దిశ దశ, కరీంనగర్:

కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ ఇంఛార్జి పురుమళ్ల శ్రీనివాస్ కు పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి షోకాజ్ నోటీసు జారీ చేశారు. గత డిసెండర్ 18న ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. డిసీసీ అధ్యక్షుడికి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే సమావేశం నిర్వహించి పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, డీసీసీ అధ్యక్షునిపై ఘాటు వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని పదే పదే హెఛ్చరించినప్పటికీ వైఖరిలో మార్పు రాలేదని పురుమళ్ల శ్రీనివాస్ తీరును తప్పు పట్టారు. ఇలాగే జరిగితే డిసిిప్లేనరీ యాక్షన్ కమిటీ చర్యలు తీసుకుంటుందని చిన్నారెడ్డి ఆలేఖలో హెచ్చరించారు. వారంలోగా వివరణ పంపించాలని, లేనట్టయితే పార్టీ క్రమ శిక్షణా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

రెండో సారి…

కరీంనగర్ అసెంబ్లీ ఇంఛార్జిగా ఉన్న పురుమళ్ల శ్రీనివాస్ కు రెండోసారి పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసు ఇవ్వడం గమనార్హం. గతంలో కరీంనగర్ కాంగ్రెస్  నాయకులతో ఉన్న విబేధాల కారణంగా ఇరు వర్గాలు అధిష్టానానికి ఫిర్యాదు చేసుకున్నాయి. అప్పుడు కూడా పురుమళ్లకు డీఏసీ షోకాజ్ నోటీసు ఇవ్వగా సంజాయిషీ ఇచ్చుకున్నారు. తాజాగా మరోసారి కూడా షోకాజ్ నోటీస్ రావడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

You cannot copy content of this page