3 వేల పేజీలు..వంద మంది సాక్షులు

శ్రద్ద మర్డర్ కేసులో పోలీసుల

దేశ వ్యాప్తంగా సంచలనం కల్గించిన శ్రద్దా వాకర్ హత్య కేసులో ఢిల్లీ పోలీసులు కోర్టులో ఛార్జి షీట్ దాఖలు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. 3 వేల పేజీల ఛార్జి షీట్ లో వంద మందిని సాక్షులను విచారించి దర్యాప్తు చేసినట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఈ నెలాఖరు వరకు ఈ కేసుకు సంబందించిన ఛార్జిషీటును కోర్టులో హాజరు పర్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

ముక్కులుగా కోసి…

గత సంవత్సరం మే 18న శ్రద్దా వాకర్ ను రంపంతో 35 ముక్కలు కోసి ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో విసిరిపడేసిన నిందితుడు అప్తాబ్ వ్యవహారం ఆమె పేరెంట్స్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసులో అన్ని కోణాల్లో విచారణ జరిపిన పోలీసులు శ్రద్దా వాకర్ కు సంబందించిన శరీర భాగాలను కొన్నింటిని సేకరించగా, మరి కొన్నింటి కోసం పోలీసులు ముమ్మరంగా వెతికారు. జనవరి 4న ఢిల్లీ అటవీ ప్రాంతంలో శ్రద్దకు సంబందించిన వెంట్రుకలు, ఎముకలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వాటిని డీఎన్ఏ పరీక్షల నిమిత్తం హైదరాబాద్ కేంద్రానికి పంపించగా అవి ఆమె కుటుంబ సభ్యులతో సరితూగినట్టు నివేదిక కూడా అందుకున్నామని వెల్లడించారు.

You cannot copy content of this page