దిశ దశ, జగిత్యాల:
జగిత్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ ఎస్ఐని బలి తీసుకుంది. కారులో ప్రయాణిస్తున్న క్రమంలో జరిగిన ఈ ఘటనలో శ్వేత అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… జగిత్యాల జిల్లా క్రైం రికార్డు బ్యూరో (DCRB)లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఐ శ్వేత గొల్లపల్లి మండలం చిల్వ కోడూరు సమీపంలో కారులో వెల్తుండగా బైక్ ను తప్పించబోయి చెట్టును ఢీ కొట్టడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో భైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా మరణించినట్టుగా పోలీసులు చెప్తున్నారు. అతని వివరాలు తెలియాల్సి ఉంది. శ్వేత గతంలో పెగడపల్లి, కథలాపూర్, వెల్గటూరు, కోరుట్ల పోలీస్ స్టేషన్ లలో పని చేశారు. ప్రస్తుతం డీసీఆర్బీలో పని చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరావల్సి ఉంది. ఎస్ఐ మృతదేహాన్ని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.