డిసెంబర్ 4 తరువాత ఏం జరిగింది..?

హార్డ్ డిస్కులను ఏం చేశాడు..?

దిశ దశ, హైదరాబాద్:

డిసెంబర్ 4న ఎస్ఐబీ కార్యాలయం నుండి తీసుకెళ్లిన హార్డ్ డిస్కులు ఏం చేశారు..? సీడీఆర్ పేపర్లను దహనం చేసినట్టుగానే ఎస్ఐబీ కార్యాలయంలోనే వాటిని ఎందుకు నాశనం ఎందుకు చేయలేదు..? అసలేం జరిగింది..? అన్న కోణంలో దర్యాప్తు బృందం ప్రణిత్ రావును ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఎస్ఐబీ కార్యాలయంలో సీన్ రీ కన్సట్రక్షన్ చేసిన తరువాత వివిధ కోణాల్లో ఆరా తీసిన పోలీసు అధికారులు చివరకు హార్డు డిస్కులను ఫ్రణిత్ రావు ఎక్కడ పడేశాడో కూపీ లాగినట్టుగా తెలుస్తోంది. హార్డ్ డిస్కులను వికారాబాద్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ధ్వంసం చేసినట్టుగా ప్రణిత్ రావు పోలీసు అధికారుల విచారణలో చెప్పినట్టుగా సమాచారం. దీంతో ఫ్రణిత్ రావును తీసుకుని దర్యాప్తు బృందం వికారాబాద్ అడవుల్లో హార్డ్ డిస్కులు వేట కొనసాగించనుంది. హార్డ్ డిస్కుల పడేసిన ప్రాంతాన్ని కూడా పరిశీలించిన సాక్ష్యాధారాలను సేకరించినట్టయితే కీలకమైన అడుగు ముందుకు పడినట్టు అవుతుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు.

మరో 15 మంది…

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తంలో మొత్తం 15 మంది పోలీసు అధికారులు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారని కూడా దర్యాప్తు బృందం గుర్తించినట్టుగా సమాచారం. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ సీఐని సోమవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారించగా మరో నలుగురు ఎస్సైలను కూడా విచారించనున్నట్టుగా తెలుస్తోంది.

You cannot copy content of this page