బెల్లంపల్లి ఎమ్మెల్యేకు సికాస వార్నింగ్

సింగరేణి కోల్ బెల్ట్ పేరిట లేఖ విడుదల

లెటర్ విడదలపై పోలీసుల ఆరా…

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను హెచ్చరిస్తూ సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ పేరిట విడుదలైన లేఖ కలకలం సృష్టిస్తోంది. ఇటీవల ఎమ్మెల్యేపై ఓ మహిళ ఆడియోలు, వాట్సప్ చాట్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనను అకారణంగా ఇరికిస్తున్నారంటూ చిన్నయ్య స్పష్టం చేశారు. ఆరిజన్ డైయిర్ తో ఎమ్మెల్యే చిన్నయ్యకు మధ్య నెలకొన్న విబేధాలకు సంబంధించిన వ్యవహారాన్ని ఊటంకిస్తూ సికాస కార్యదర్శి ప్రభాత్ విడుదల చేసిన ఈ లేఖపై చర్చ సాగుతోంది. ఎమ్మెల్యే చిన్నయ్య అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ ప్రభాత్ ఆ లేఖలో ఆరోపణలు చేశారు. ఆరిజన్ డైయిరికి చెందిన ఆదినారయణతో పాటు మరో మహిళ, ఎమ్మెల్యే పరస్పర సహకారంతో అక్రమ కార్యకాలపాలకు పాల్పడ్డారని ఇటీవల ఈ సంస్థ ప్రతినిధులతో వచ్చిన ఆర్థిక లావాదేవీల్లో వచ్చిన బేధాభిప్రాయలతో బహిర్గతం కావడంతో రైతులు మోసపోయారన్నారు. ఈ విషయంపై రైతులు ఒత్తిడి చేయడంతో సంస్థపై కేసులు పెట్టించి తనకు ఏమాత్రం సంబంధం లేదని నమ్మించే ప్రయత్నం చేశారని ప్రభాత్ అన్నారు. సంస్థ ప్రతినిధులు ఆడియో రికార్డులు బయటపెట్టడంతో ఎమ్మెల్యే వ్యవహారం వెలుగులోకి వచ్చిందన్నారు. భూ కబ్జాలకు పాల్పడుతూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారంటూ సికాస కార్యదర్శి మండి పడ్డారు.

సికాస లేఖపై ఫోకస్ పెట్టిన పోలీసులు

అయితే దుర్గం చిన్నయ్య వ్యవహారానికి సంబంధించిన విషయంలో సికాస పేరిట విడుదలైన లేఖపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సికాస పేరిట వచ్చిన లేఖ అనుమానాలు వ్యక్తం అవుతుండడంతో నిఘా వర్గాలు కూడా రంగంలోకి దిగాయి ప్రభాత్ పేరిట పంపిన ఈ లెటర్ వెనుక ఉన్న వారెవరోనన్న కోణంలో తెలుసుకుంటున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

You cannot copy content of this page