ఒంటరి పురుషులకూ చేయూతనందించాలి: తెరపైకి వచ్చిన సరికొత్త డిమాండ్

దిశ దశ, జగిత్యాల:

పురుషులను, మహిళను సమానంగా పరిగణిస్తున్న ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు విషయంలో కూడా అదే పద్దతి అవలంబించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఒంటరి మహిళలను పరిగణించినట్టుగానే ఒంటరి పురుషులకూ చేయూతనందించాలని కోరుతున్నారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అలూరు మాజీ సర్పంచ్ రాంరెడ్డి లేవనెత్తిన ఈ అంశం సరికొత్త చర్చకు దారి తీసింది. భర్త చనిపోయి ఒంటరిగా మిగిలి మహిళలకు ప్రభుత్వం ఎలా అయితే బాసటగా నిలుస్తోందో అదే విధానాన్ని పురుషులకు అమలు చేయాలని కోరుతున్నారు. భార్య చనిపోయిన తరువాత ఒంటిరిగా మిగిలిపోయి రెండో వివాహం చేసుకునే అవకాశం లేక ఇబ్బందులు పడుతున్న పురుషులను కూడా ఆదుకునేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవలని అభ్యర్థిస్తున్నారు. ఒంటరి పురుషుల గురించి గ్రామ స్థాయిలో సర్వే  చేయించి వారికి బాసట ఇవ్వాలని కోరుతున్నారు. మాజీ సర్పంచ్ రాంరెడ్డి చేసిన ఈ ఢిమాండ్ ద్వారా ఒంటరి పురుషుల ఇక్కట్లు కూడా వెలుగులోకి వచ్చినట్టయింది. అయితే ఆయన చేసిన ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. 

You cannot copy content of this page