దిశ దశ, జగిత్యాల:
టీఎస్‌పీఎస్పీ గ్రూప్స్ ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) క్షేత్ర స్థాయిలో విచారించడం ఆరంభించింది. జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో కొంతమందిని పిలిపించుకుని విచారించిన సిట్ బృందం వారి నుండి వాంగ్మూలాలు తీసుకోవడంతో పాటు పరీక్ష పేపర్ల లీకేజీకి సంబంధించిన వివరాలు కూడా అడుగుతున్నట్టు సమాచారం. మల్యాల మండలం తాటిపల్లికి చెందిన రాజశేఖర్ రెడ్డి ఈ కేసులో ఏ2 నిందితునిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మల్యాల మండలానికి చెందిన వారు పెద్ద మొత్తంలో పరీక్షలు రాశారని ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా ఆరోపించారు. అయితే ఈ వ్యవహారానికి సంభందించిన పూర్తి వివరాలు సేకరించేందుకు సిట్ బృందం అభ్యర్థులను వ్యక్తిగతంగా కలుస్తూ ఆరా తీస్తోంది. ఇప్పటి వరకు
మల్యాలకు చెందిన అయిదుగురిని, ఓ ఆర్టీసీ ఉద్యోగిని సిట్ విచారించినట్టుగా తెలుస్తోంది. మరికొంతమందిని కూడా కూడా సిట్ టీమ్ విచారించే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం. అయితే వివరాలు వెల్లడిచేందుకు మాత్రం సిట్ అధికారులు నిరాకరిస్తున్నారు.