అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పిలుపు…
దిశ దశ, ఎడ్యూకేషన్:
మానవ సంబంధాలతో జీవనం సాగించే ప్రతి ఒక్కరూ రక్తం పంచుకుపుట్టిన బిడ్డలేనని, తోబుట్టువులతో మరింత ప్రేమ ఆప్యాయతలతో మెదిలాల్సి ఉంటుందని అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి అన్నారు. గురువారం కొత్తపల్లి అల్ఫోర్స్ ఇ టెక్నో పాఠశాలలో జాతీయ సిబ్లింగ్స్ (తోబుట్టువుల) దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ… ప్రతి ఒక్కరితో సోదరి సోదర భావంతో మెదలడంతో పాటు ఒకే కుటుంబంలో జన్మించిన వారు ప్రేమను పంచుకుంటూ జీవనం సాగించాల్సి ఉంటుందన్నారు. ఒకే కుటుంబంలో జన్మించిన సిబ్లింగ్స్ మధ్య ప్రేమ, అనురాగం పెంపొందినప్పుడే శాంతియుత వాతావరణం నెలకొంటుందన్నారు. కష్ట సుఖాల్లో పాలు పంచుకునే తోబుట్టువులతో సాన్నిహిత్యంగా మెదలడం వల్ల ఎంతో షంతోషాన్ని ఇస్తుందన్నారు. వారి అండదండలతోనే అన్నింటా అభ్యున్నతి వైపునకు అడుగులు వేస్తారని నరేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. భారతదేశంలో సాంప్రాదాయ పండగ అయిన రాఖీ పౌర్ణమి మాదిరిగానే సిబ్లింగ్స్ డే కూడా ఘనంగా నిర్వహించుకునే ఆనవాయితీ కూడా కొనసాగుతోందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు భాయి, బహెన్… హమారా భాయి బహెన్ ప్రదర్శన ద్వారా అన్నదమ్ముల్లు, అక్కా చెల్లెల్ల మధ్య ఉండే ఆత్మీయ అనుబంధం గురించి విద్యార్థులకు వివరించే ప్రయత్నం చేశారు.