ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ..!

దిశ దశ, కరీంనగర్:

ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ అన్న నానుడి ఖచ్చితంగా సరిపోతుందేమె కరీంనగర్ బల్దియా తీరు గమనిస్తే. ఇంతకాలం వారి ప్రమేయం గురించి ప్రస్తావించడానికి మనసొప్ప లేదు కానీ ఇఫ్పుడు మాత్రం వారినే అందలం ఎక్కిస్తున్న తీరు విస్మయం కల్గిస్తోంది.

‘స్మార్ట్’ గౌరవం…

దేశ వ్యాప్తంగా నగరాలను అభివృద్ది పర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘స్మార్ట్ సిటీ’ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాల వాటా సగం, కేంద్ర ప్రభుత్వ వాటా సగం చొప్పున కెటాయించి ఆయనగరాల్లో పనులు ప్రారంభించేందుకు నిధుల వరద పారించింది. అయితే జనాభా ప్రాతిపదికన కరీంనగర్ ను స్మార్ట్ సిటీగా గుర్తించేందుకు కేంద్రం విముఖత చూపడంతో కరీంనగర్ నుండి ప్రత్యేక బృందం ఢిల్లీకి వెల్లి మరీ కరీంనగర్ ను స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చాలని అభ్యర్థించారు. కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా వ్యవహరించి నిబంధనలను సవరించి కరీంనగర్ కు అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా కరీంనగర్ అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 400 కోట్ల వరకూ కెటాయించింది.

అప్పుడేమయిందో..?

ఇకపోతే కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కల్పించిన నగరాల సరసన చేర్చిన కరీంనగర్ అభివృద్ది కోసం స్మార్ట్ సిటీ ద్వారా నిధులు కెటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఈ స్కీం కింద కరీంనగర్ రూపు రేఖలనే మార్చేశారు. రోడ్లు, మిడియన్స్, ఇతరాత్ర ఎన్నో రకాల అభివృద్ది కార్యక్రమాలతో ప్రజలకు మౌళిక వసతులు కల్పించడంలో సఫలం అయ్యారు. వందల కోట్లు వెచ్చించినా కూడా ఏ రోజూ కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులను ఆహ్వానించ సదర్భాలు లేవు. ఇప్పుడు మాత్రం కేంద్ర మంత్రిని పిలిచి మరీ పథకాలను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్న తీరే అందరి నోట ఔరా అనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టినప్పటిన ఈ పనుల విషయంలో స్మార్ట్ సిటీ నిధులు కేంద్రానివి అన్న విషయాన్ని చెప్పేందుకు ఆనాడు ఒక్క గొంతుక కూడా సాహసించేలేదు. స్మార్ట్ సిటీగా కరీంనగర్ గుర్తింపు రావడం వెనక తమ గొప్పతనం ఉందని చెప్పుకోవడానికి ప్రయత్నించిన నాయకులూ ఉన్నారు. కానీ ఇక్కడి నుండి లోకసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీని ఆహ్వానించేందుకు కూడా చొరవ చూపలేదన్నది వాస్తవం. ఉన్నట్టుండి ఈ స్కీం ప్రారంభోత్సవాలకు కేంద్ర మంత్రులను పిలిపించడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటన్న చర్చ కరీంనగర్ అంతటా సాగుతోంది.

రెండు నెలల్లో…

మరో రెండు నెలల్లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్మార్ట్ సిటీ స్కీం ముగియనుంది. ఈ పథకం ద్వారా కేంద్రం నిధులు కెటాయించే అవకాశలు అయితే కనిపించడం లేదు. ఇప్పటి వరకే పలు మార్లు ఈ స్కీం అమలును పొడగించడంతో ఇంతటితే ఈ పథకాన్ని నిలిపివేయాలని యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే చివరి అంకానికి చేరిన ఈ సమయంలో కేంద్ర మంత్రిని పిలిపించి స్మార్ట్ సిటీ నిధులతో చేపట్టిన డ్రింకింగ్ వాటర్ స్కీ, ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ పార్క్ వంటి పనులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుండడం అన్ని వర్గాలను ఆశ్యర్య పరుస్తోంది. ఉన్నట్టుండి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులపై మమకారం ఎందుకు పుట్టకొచ్చిందన్నదే పజిల్ గా మారిందని అటు రాజకీయ వర్గాలు, ఇటు నగర వాసులు చర్చించుకుంటున్నారు.

You cannot copy content of this page