కరీంనగర్ లో బడేమియా… సరిహద్దుల్లో ఛోటే మియా…

`రేషన్ బియ్యం స్మగ్లింగ్ వ్యవహారం తీరు…

దిశ దశ, దండకారణ్యం:

తెలంగాణ రేషన్ బియ్యం అక్రమ తరలింపులో ఒక్క సరిహద్దు ప్రాంతాలకు చెందిన వారే భాగస్వాములు కాలేదు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారూ ఈ దందాలో భాగస్వాములు అయినట్టుగా ఉంది. కరీంనగర్ ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యాపారులు రేషన్ బియ్యం సరిహధ్దులు దాటించే వ్యవహారంలో అత్యంత ముఖ్య భూమిక పోషిస్తున్నారు. కొన్ని రైస్ మిల్లులు కూడా లీజుకు తీసుకుని దర్జాగా దందాను కొనసాగిస్తున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు.

ఏక్ రూప్ యా వాలా…

రేషన్ బియ్యం దందాలో మునిగి తేలిన ఓ వ్యాపారి పేరే ఏక్ రూప్ యా వాలా అన్న బిరుదే వచ్చిందంటే ఆయన ఈ దందాలో ఏ స్థాయిలో వేళ్లూనకపోయాడో అర్థం చేసుకోవచ్చు. మొదట్లో కరీంనగర్ తో పాటు పరిసర ప్రాంతాల్లోని మిల్లులే అడ్డాగా సాగిన ఈ దందాను క్రమక్రమంగా మహారాష్ట్ర వరకూ విస్తరించారు. గతంలో కరీంనగర్ పోలీసు అధికారులు కూడా రేషన్ బియ్యం దందాగాళ్లపై షీట్లు కూడా ఓపెన్ చేస్తామని ప్రకటించినా వారి వైపు కూడా కన్నెత్తి చూడలేదు. దీంతో వారి అక్రమ దందా నిరాంటకంగా సాగుతూనే ఉంది. ఈ వ్యాపారీ కేంద్రీకృతంగానే కరీంనగర్, వరంగల్, జమ్మికుంట, పెద్దపల్లి తదితర ప్రాంతాల్లోని మిల్లుల్లో రేషన్ బియ్యం రీ సైక్లింగ్ అవుతూ అక్రమంగా రవాణా అవుతున్నాయని నిఘా వర్గాల విచారణలో తేలింది. సరిహధ్దు ప్రాంతంలో డెన్ ఏర్పాటు చేసుకున్న బియ్యం వ్యాపారి, కరీంనగర్ కు చెందిన ఏక్ రూపాయావాలకు మధ్య భాగస్వామ్యం ఉండడం వల్లే ఈ దందాను యథేచ్ఛగా సాగిస్తున్నట్టుగా స్పష్టమవుతోంది.

పదుల సంఖ్యలో…

వీరిద్దరి గుప్పిటనే భారీగా మిల్లులు… వాహనాలు ఉన్నాయని కూడా తెలుస్తోంది. వీరి కనుసైగలతోనే మిల్లుల్లో బియ్యం అయినా… రోడ్లపై ఉన్న వాహనాల్లో అయినా కదలిక స్టార్ట్ అవుతుందని తెలిసింది. తెల్లవార్లూ మిల్లుల్లో బియ్యం రీ సైక్లింగ్ చేసి ఉదయానికల్లా సరిహద్దులు దాటించే నెట్ వర్క్ ను ఏర్పాటు చేసుకున్న వీరి వాహానలు వెల్తున్నాయంటే సంబంధిత శాఖల యంత్రాంగమంతా కూడా చేష్టలుడిగి చూస్తూ ఉంటుందన్న విమర్శలు కూడా లేకపోలేదు. నక్సల్స్ ప్రాబల్యం కారణంగా సరిహధ్దుల్లో పోలీసులు అడుగడుగునా నిఘా వేసినా బియ్యం తరలించే వాహనాలకు మాత్రం రాచమార్గం తెరుచుకుంటుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సామాన్యుడు వెల్తే సవాలక్ష ప్రశ్నలు వేస్తూ.. వారి లగేజీలన్ని క్షుణ్ణంగా పరిశీలించే పోలీసు యంత్రాంగం కూడా అటుగా వెల్లే బియ్యం వాహనాలు మాత్రం దర్జాగా వెల్లిపోతూనే ఉంటాయన్న ప్రచారం ఉంది.

అటు ఏలా..?

సాధారణంగా మార్కెటింగ్ వ్యవస్థ అంతగా లేని సరిహధ్దు ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు పంటలు తరలిస్తుంటారు. ఎక్కడ అయితే మార్కెట్ జరిగే అవకాశం ఉందో ఆ ప్రాంతానికి రైతులు వాహనాలను తరలించి విక్రయించుకుంటుంటారు. కానీ ప్రాణహిత, గోదావరి పరివాహక ప్రాంతంలో మాత్రం అత్యంత విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణాలోని కొన్ని పట్టణ ప్రాంతాల నుండి వాహనాలు సరిహధ్దు ప్రాంతాలకు వెల్తుండడం ఆశ్యర్యపరుస్తున్నది. అక్కడ మార్కెటింగ్ సౌకర్యం లేకున్నా ఈ వాహనాలు అటుగా వెళ్లడానికి కారణం ఏంటీ..? వాటిలో ఏముంది అన్న విషయం గురంచి ఆరా తీస్తే ‘‘లోగుట్టు పెరుమాళ్ళకే ఎరుక’’ అన్న పరిస్థితులు నెలకొన్నాయక్కడ.

You cannot copy content of this page