గోడలో పాములు… ఇంట్లో మనుషులు…

దిశ దశ, భద్రాద్రి కొత్తగూడెం:

ఒక్క పాము కనిపిస్తేనే భయం గుప్పిట చేరిపోతుంటాం. అలాంటిది ఏకంగా 32 పాములు ఓ ఇంటి గోడలో అవాసం ఏర్పర్చుకుంటే అక్కడ నివసించే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. ఎన్ని రోజులుగా నివాసం ఉంటున్నాయో తెలియదు కాని పాముల ఉనికిని గమనించిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అప్రమత్తం అయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ టీమ్ ప్రతినిధులకు సమాచారం ఇవ్వడంతో వాటిని పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని నెహ్రూ బస్తికి చెందిన ఎలక్ట్రిషియన్ రాజు ఇంటి గోడకు ఏర్పడిన రంధ్రంలో పాము పిల్లలు కనిపించడంతో ఉలిక్కిపడ్డారు. వెంటనే స్నేక్ క్యాచర్ టీమ్ కు సమాచారం ఇవ్వడంతో దత్తు బృందం సభ్యులు రాజు ఇంటికి చేరుకుని కొన్ని గంటల పాటు శ్రమించి పాములను డబ్బాలో బంధించి వాటిని సురక్షిత ప్రాంతంలో వదిలే శారు. అయితే స్నేక్ క్యాచ్ టీమ్ ఒక పెద్ద పాముతో పాటు ఏకంగా 32 నాగు పాము పిల్లలను ఈ ఆపరేషన్ లో క్యాచ్ చేయడం గమనార్హం. రాజు కుటుంబ సభ్యులు ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా తీరని నష్టం వాటిల్లేదని స్థానికులు అంటున్నారు.

You cannot copy content of this page