శోభనం వీడియోను సోషల్ మీడియాలో పెట్టిన భర్త

ఇటీవల కాలంలో కొంతమంది ప్రవర్తిస్తున్న తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉంటోంది. నాలుగు గోడల మధ్య రహస్యంగా ఉండాల్సిన భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కొంతమంది పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇటీవల లైక్స్ కోసం ఓ జంట సోషల్ మీడియాలో తమ ఫస్ట్ నైట్ వీడియోను పెట్టి తీవ్ర విమర్శల పాలయ్యారు. తాజాగా అలాంటి ఘటన ఏపీలోని డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది. తొలిరాత్రి ఇద్దరు ఏకాంతంగా గడిపిన క్షణాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

వివరాల్లోకి వెళ్తే.. కాట్రేనికోన మండలంలోని ఓ తీర ప్రాంత గ్రామంలో ఓ యువకుడికి ఫిబ్రవరి 8వ తేదీన అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికతో వివాహం అయింది. ఆ తర్వాత వారికి పెద్దలు శోభనం ఏర్పాటు చేశారు. ఆ యువకుడు తన భార్యతో కలిపిన మొదటి రాత్రి దృశ్యాలను వీడియోలో చిత్రీకరించాడు. మరుసటి రోజు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ జంట శోభనం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విషయం ఇరు కుటుంబ సభ్యులకు తెలిసింది. అయితే తానే ఆ ఘన కార్యం చేశానని యువకుడు బుద్ధిలేకుండా అంగీకరించాడు.

దీంతో వధువు కుటుంబ సభ్యులు వరుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అమ్మాయితో పాటు తమ కుటుంబ పరువు పోయిందని వధువు కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గత నెల 20వ తేదీన తల్లితో కలిసి బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫిబ్రవరి 28వ తేదీన ఆ యువకుడిని అరెస్టు చేశారు. అతడిని కోర్టులో హాజరుపరచగా.. 14 రోజుల రిమాండ్ విధించారని పోలీసులు వెల్లడించారు.

You cannot copy content of this page