అరగుండు.. అరమీసం…

పారిశుద్ధ్య కార్మికుల వింత నిరసన

దిశ దశ, భూపాలపల్లి:

గ్రామ పంచాయితీ కార్మికులు వినూత్న పద్దతుల్లో నిరసనలు తెలుపుతూ తమ ఆవేదను వ్యక్తం చేస్తున్నారు. పంచాయితీల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండడానికి కృషి చేస్తున్న తమ డిమాండ్లను పరిష్కరించేందుకు చొరవ చూపాలని కోరుతున్నారు. న్యాయమైన తమ కోర్కెలను పరిష్కరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకోవాలని అభ్యర్థిస్తున్నారు. ఇందులో భాగంగా 25 రోజులుగా నిరసనలు తెలుపుతున్న పంచాయితీ కార్మికులు వింత వింత పద్దతుల్లో తమ కష్టాలను ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికులు ఏకంగా నాగుపాముకు వినతి పత్రం ఇచ్చిన సంగతి చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో పంచాయితీ కార్మికులు తమకు న్యాయం చేయాలని కోరుతూ అర గుండు, అర మీసంతో నిరసన తెలిపారు. తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఇలాగే ఉందని చెప్పేందుకు కార్మికులు ఈ వినూత్న నిరసన చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తమ కోర్కెలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని వారు కోరుతున్నారు.

You cannot copy content of this page