స్వతంత్రుడిగా సోమారపు

స్వతంత్రుడిగా సోమారపు

కమలానికి బైబై…

దిశ దశ, రామగుండం:

రాష్ట్రంలో బలం చూపిస్తామంటు ప్రకటనల వర్షం గుప్పిస్తున్న భారతీయ జనతా పార్టీ బలగాన్ని కోల్పోతోంది. రాష్ట్రంలో మా సత్తా ఏంటో చూపిస్తామని చెప్తున్న నాయకులకు పలువురు పార్టీని వీడుతున్న వైనం ఆందోళన కల్గిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గన్ షాట్ గా గెలుస్తామని చెప్పుకున్న సీట్లలో ఎన్నికలకు ముందే చేజారిపోయినట్టయింది.

సోమారపు రాజీనామా

పెద్దపల్లి జిల్లా రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే తాను ఏ పార్టీలో కూడా చేరేది లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే తాను బీజేపీలో కొనసాగితే ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం లేదని సన్నిహితులు చెప్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించారు. ఎడాది క్రితమే పెద్దపల్లి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సోమారపు సత్యనారాయణ పార్టీలో కొనసాగే అవకాశాలు లేవన్న చర్చ సాగింది. అయితే అప్పటి నుండి కూడా ఆయన బీజేపీలో కొనసాగడంతో ఆయన ఈ సారి కమలం గుర్తుపై పోటీ చేస్తారని ఆశించారంతా. అనూహ్యంగా బీజేపీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ గెలిచే స్థానాల్లో రామగుండం కూడా ఉంటుందని ఆ పార్టీ నాయకులు ఇప్పటివరకు అంచనాలు వేసుకుంటూ వచ్చారు. అయితే తాజాగా సోమారపు సత్యనారాయణ తీసుకున్న నిర్ణయం బీజేపీకి అశనిపాతంగా మారిందని చెప్పక తప్పదు

You cannot copy content of this page