సర్కారు సార్ల కవరింగ్ షురూ…

దిశ దశ, హైదరాబాద్:

సార్ మీకు ఆ ప్రాంతంలో కొంచెం బలహీనంగా ఉంది… అక్కడ ఫలానా వాళ్లను అనుకూలంగా మల్చుకుంటే మరింత లాభం చేకూరుతుంది… మీరా పని చేస్తే మీ ప్రత్యర్థిపై మరింత పట్టు సాధించే అవకాశం ఉంటుంది అంటూ ఫోన్లు మొదలయ్యాయట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనుకూల వాతావరణం మొదలు అయినట్టుగా అంచనా వేస్తున్న కొంతమంది పోలీసు అధికారులు అప్పుడే ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల మనసు దోచుకునే పనిలో పడ్డారన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది అప్ డేట్స్ పర్వం మరింత పెరిగిపోయినట్టుగా ఆయా శాఖల అధికార యంత్రాంగంలో చర్చ జరుగుతోంది. వాట్సప్ లేదంటే ఇతర యాప్ ల ద్వారా కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థుల టచ్ లోకి వెల్లి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తున్నారట. ఎన్నికల్లో గులాభి గుభాలించే పరిస్థితి లేకుండా పోయిందన్న ప్రచారం తీవ్రం కావడంతో ఒక్కో అధికారి సంబంధిత ప్రాంతాలకు నాయకులను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నం అయినట్టుగా పోలీసు విభాగంలో గుసగుసలు మొదలయ్యాయి. రాష్ట్రంలో ఇంతకాలం అధికారంలో ఉన్న గులాభి పార్టీ ప్రాభవం తగ్గిపోయిందని భావిస్తున్న కొంతమంది అధికారులు ముందస్తు చర్యల్లోకి దిగిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది. తాము సేఫ్ గా ఉండాలన్న తాపత్రయంతో కొంతమంది అధికారులు ప్రత్యర్థి పార్టీ వైపు మొగ్గు చూపే ప్రక్రియకు అప్పుడే శ్రీకారం చుట్టేశారా అన్న చర్చ కూడా సాగుతోంది. 9 ఏళ్ల పాటు అధికార పార్టీ నేతల అండదండలతో మంచి పోస్టింగులు పొందిన నాయకులు తమ భవిష్యత్తు కూడా ఇలాగే కొనసాగించాలంటే తామే ఫస్ట్ ఖర్చీఫ్ వేస్తేనే లక్ష్యం నెరవేరుతుందన్న అభిప్రాయంతో నెమ్మదిగా పావులు కదిపే పనిలో కొంతమంది నిమగ్నం అయ్యారట. ఎన్నికలకు ముందు నుండే కవరింగ్ షురూ చేస్తే ఫస్ట్ ఇన్ ఫస్ట్ తామే ప్రజల నాడిని తెలియిజేశామని అందుకు తగిన ప్రతిఫలంగా మంచి పోస్టింగ్ ఇప్పించాలని అధికారంలోకి రాగానే సదరు ఎమ్మెల్యేను అభ్యర్థించే అవకాశం ఉంటుందని భావిస్తున్న కొంతమంది పోలీసు అధికారులు అప్పుడే కార్యరంగంలోకి దూకినట్టుగా తెలుస్తోంది. దీంతో ఇప్పటి వరకు గులాభి జెండా నీడలోనే తామున్నామని ప్రతిపక్షాలను ముప్పు తిప్పలు పెట్టిన విషయాన్ని పట్టించుకోకుండా వ్యవహరించిన తీరు గురించి సదరు అభ్యర్థులు మర్చిపోతారా అన్న చర్చ కూడా సాగుతోందట ప్రభుత్వం యంత్రాంగంలో. అయితే ఇప్పటికిప్పుడు ఫ్లేట్ ఫిరాయించి లైమ్ లైట్ పోస్టింగ్ కోసం బెర్త్ ఖరారు చేసుకుంటున్న తీరును చూస్తున్న యంత్రాంగం తీరును చూసి నవ్వకుంటున్న వారూ లేకపోలేదు. అయితే వీరి అంచనాలు తలకిందులు చేస్తూ ఓటర్లు తీర్పునిస్తే అప్పుడేం చేస్తారో ఈ సార్లు అంటూ గోణకుంటున్నారట. ఏది ఏమైనా కొంతమంది అధికార యంత్రాంగం మారిన తీరు మాత్రం అందరినీ ఆశ్యర్యంలోకి ముంచెత్తుతోంది.

You cannot copy content of this page