ఇప్పటి వరకు ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితం అయిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ప్రాతినిథ్యాన్ని దక్షిణాది రాష్ట్రాల నుండి కల్పిస్తే ఎలా ఉంటుందోనన్న అంశంపై ఏఐసీసీ ముఖ్య నాయకులు సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. మరో తొమ్మిది నెలల్లో పదవి కాలం ముగుస్తుండడంతో కర్ణాటక నుండి సోనియా గాంధీని పెద్దల సభకు పంపించాలన్న ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఏప్రిల్ 2024న జీసీ చంద్రశేఖర్, సయ్యద్ నసీర్ హుస్సేన్, డాక్టర్ ఎల్ హనుమంతయ్య, రాజీవ్ చంద్రశేఖర్ ల పదవీ కాలం వచ్చే ఏడాది ఎప్రిల్ లో ముగయనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలాన్ని బట్టి ముగ్గురిని ఎగువ సభకు పంపిచే అవకాశం ఉంది. ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గేకు అనుభందంగా ఉన్న ఏఐసీసీ కో ఆర్డినేటర్ నసీర్ కు మరోసారి రాజ్యసభకు అవకాశం కల్పించాలని భావిస్తుండగా, మరో రెండు స్థానాల నుండి సోనియా గాంధీ, సోషల్ మీడియా చీఫ్, పార్టీ అధికార ప్రతినిధి శ్రీనాథ్ ను కూడా ఈ సారి పెద్దల సభకు పంపించాలన్న ప్రతిపాదనలు ఏఐసీసీ ముఖ్య నేతలు పరిశీలిస్తున్నట్టుగా సమాచారం.