దిశ దశ, హైదరాబాద్:
అంతరిక్ష పరిశోధనల్లో భాగంగా చంద్రుడికి దక్షిణ ప్రాంతంలో ఏముందో తెలుసుకునేందుకు పరీక్షించాలని భావించిన పరిశోధకులకు ఆయువు పట్టుగా నిలిచింది మాత్రం దక్షిణాది రాష్ట్రాలే కావడం విశేషం. చంద్రయాన్ 3 ప్రయోగానికి వేదికగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట గురించి మాత్రమే అందరు తెలుసుకున్నారు. శ్రీహరికోట ఇక్కడి నుండి జులై 14న కక్ష్యలోని చంద్రయాన్ 3ను పంపించడంతో సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా విక్రమ్ ల్యాండర్ సేఫ్ దక్షిణ ధృవంలో ల్యాండ్ కావడం ఒక ఎత్తైతే, ప్రగ్యాన్ రోవర్ బుడిబుడి అడుగులు వేయడం కూడా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు అంతరిక్ష పరిశోధన గురించి మాత్రమే వింటున్న మనం ఇస్రో శాస్త్రవేత్తలు అంతకు ముందు చేసిన ప్రయెగాలకు కూడా దక్షిణాది రాష్ట్రాల మట్టే కీలకంగా మారింది.
ముందు ఇక్కడి మట్టిలోనే..
చంద్ర మండలంలోకి అడుగుపెట్టిన తరువాత ల్యాండర్, రోవర్ తిరగాలంటే అక్కడ వాతావారణం ఎలా ఉంటుందో అంచనా వేసినప్పటికి అక్కడ సంచరించేందుకు చంద్రమండలంలోని ఉపరితలం అనువుగా ఉంటుందా..? లేదా..? అక్కడ ల్యాండర్, రోవర్ మూవ్ మెంట్ చేయాలంటే ఎలా అని ఆలోచించారు. ముందుగా పరిశోధనా కేంద్రంలో ప్రాక్టికల్ పరీక్షలు చేయాలంటే ఏం చేయాలి అని తర్జనభర్జనలు పడ్డ వారికి అద్భుతమైన ప్రాంతం కనిపించడంతో ముందుగా ఆ మట్టిలో ప్రయోగాలు చేసి సఫలం అయ్యారు. తమిళనాడులోని నమక్కళ్ తో పాటు సమీప గ్రామాల్లోని మట్టి చంద్రమండలంలోని దక్షిణ ధృవంలో ఉన్న మట్టిలా అనిపించడంతో పరిశోధకులు తమ ప్రయోగాలను ఈ మట్టిలోనే నిర్వహించారు. చెన్నైకి 400 కిలోమీటరల్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలోని మట్టిని 50 టన్నుల మేర 2012లో సేకరించిన ఇస్రో ఈ మేరకు పరిశోధనలు చేపట్టింది. పలు పరీక్షలు నిర్వహించిన అనంతరం చంద్రమండలం ఉపరితలంలో ఉన్న మాదిరిగానే నమక్కళ్ ప్రాంతంలోని మట్టి సరితూగడంతో వారి ప్రయోగాలు సులువుగా ముందుకు సాగాయి. 2019లో ప్రయోగించిన చంద్రయాన్ 2 మిషన్ లో నమక్కళ్ మట్టిలోనే ల్యాండ్ రోవర్ చే అడుగులు వేయించి సక్సెస్ అయ్యారు. తాజాగా చంద్రయాన్ 3 కూడా ఈ మట్టినే వినియోగించారు. నమక్కళ్, సీతంపూంది, కున్నమళై గ్రామాల్లో ఈ రకమైన మట్టి లభ్యం అవుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. చంద్రమండలంలపై అనోర్థోసైట్ రకం మట్టి ఉండగా ఇదే రకమైన మట్టి నమక్కళ్ పరిసర గ్రామాల్లో లభ్యం అవుతుండడం విశేషం. అయితే రానున్న కాలంలో కూడా ఇస్రో చేపట్టే పరిశోధనలకు ఈ ప్రాంతంలోని మట్టినే వినియోగించనున్నారు.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post