అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి సంచలన నిర్ణయాలు…
దిశ దశ, కరీంనగర్:
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వి నరేందర్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. అటు నిరుద్యోగులను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తూనే ఇటు ఓటరు నమోదు కోసం కూడా ప్రత్యేక దృష్టి సారించారు. కరీంనగర్ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్న అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి పట్టు కోసం పావులు కదుపుతున్న తీరు సంచలనంగా మారింది. ఓటర్ల నమోదు కోసం ప్రత్యేకంగా 50 మందిని నియమించి మిస్ట్ కాల్ ఇస్తే చాలు ఓటరుగా నమోదు చేయించే బాధ్యతలు తీసుకుంటామని ప్రకటించారు. ఈ మేరకు బుధవారం 9240021444
నంబర్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని వివరించిన నరేందర్ రెడ్డి పట్టభద్రులు తమ పేర్లను ఓటర్లుగా నమోదు చేయించుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మిస్డ్ కాల్ క్యాంపెయిన్ ను సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్క గ్రాడ్యూయేట్ కూడా తమ పేర్లు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. 4 లక్షల మందిని ఓటర్లు చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.
స్పెషల్ యాప్…
ఇకపోతే నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు అప్పుడే నిమగ్నం అయ్యారు వి నరేందర్ రెడ్డి. తెలంగాణాలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరిని సుశిక్షుతులుగా తీర్చిదిద్దేందుకు కార్యచరణ రూపొందిచామని ప్రకటిచిన ఆచన వచ్చే దీపావళి పండగ రోజును ప్రత్యేకంగా యాప్ ను ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తాను ముందుకు సాగుతానని, ఎంతో శ్రమించి ఉన్నత చదువులు చదివిన వారికి శాశ్వత మార్గాన్ని చూపించేందుకు బాసటగా నిలుస్తానన్నారు. నిరుద్యోగుల కోసం కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేస్తానని కూడా హామీ ఇచ్చారు.
ఫీజు రియంబర్స్ మెంట్ పై….
రాష్ట్రంలోని ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాలకు ఫీజు రియంబర్స్ మెంట్ చేతికి అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరకపోయారని వారి సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటానని నరేందర్ రెడ్డి ప్రకటించారు. డిగ్రీ, పీజీ కాలేజీల నిర్వాహకుల పరిస్థితిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు వీలైనంత త్వరగా మంజూరు చేసేందుకు తనవంతు బాధ్యతగా తీసుకుంటానన్నారు. కాలేజీల యాజమాన్యాలు సమన్వయం పాటించాలని కోరిన ఆయన బకాయిల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.