హృదయాలను చూడండి…

మరణాలను కట్టడి చేయండి

డ్యాన్స్ చేస్తూ కుప్ప కూలిపోయారో చోట… మాట్లాడుకుంటూ నేల రాలిపోయారో చోట… శత వత్సరాల జీవితం ఆరుపదులకు చేరితే నేడది మూడు పదులను దాటడం లేదన్న విషయం అందరినీ కలిచివేస్తోంది. ఒక్కరా ఇద్దరా పిట్టల్లా రాలిపోతున్న వారి ప్రాణాలను కాపాడడం ఎలా..? ప్రాణం పోయే పరిస్థితికి చేరాక కలవరపడిపోవడం కంటే… ముందు జాగ్రత్త తీసుకోవడం బెటర్ అనుకున్నారా మంత్రి. ఇదే లక్ష్యంగా ఆ నిర్భంద గుండె పరీక్షలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు.

కరీంనగర్ కేంద్రంగా…

కరీంనగర్ జిల్లాకు చెందిన రాష్ట్ర పౌరసఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ యువతను కంటికి రెప్పలా కాపాడుకోవాలని భావించారు. ఇందు కోసం యువతకు నిర్భంద గుండె పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు జిల్లా యంత్రాంగాన్ని. 18 ఏళ్లు దాటి విద్యాభ్యాసం చేస్తున్న ప్రతి స్టూడెంటుకు పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. భావి భారత పౌరులు అకాల మరణం చెందడం అత్యంత బాధకరమని, దేశ ఆశల సౌధాలు ఇలా కుప్పకూలిపోయి విగత జీవులుగా మారడం ఆందోళనకరమని వ్యాఖ్యానించిన మంత్రి గంగులు గుండె పరీక్షలకు శ్రీకారం చుట్టాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. మొదట విడుతగా ఇంజనీరింగ్ విద్యార్థులకు పరీక్షలు జరిపి వ్యాధులు నిర్దారించాలన్నారు. 18 ఏళ్లు దాటిన విద్యార్థులందరికీ పరీక్షలు జరిపి మీ గుండే ధిటువుగానే ఉందన్న గుండె ధైర్యం ఇచ్చి, అనారోగ్య లక్షణాలు ఉన్న వారికి వైద్యం అందించాలన్నారు.

రాష్ట్రంలోనే ఫస్ట్ టైం…

రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా విద్యార్థుల మరణాలను నిలువరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంలో కరీంనగర్ ఆదర్శంగా నిలిచింది. ఏ జిల్లాలో లేని విధంగాద కరీంనగర్ లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు చికిత్స అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దీనివల్ల హఠన్మారణాలకు బ్రేకులు వేయొచ్చని భావిస్తున్నారు మంత్రి గంగుల కమలాకర్. కార్డియాక్ అరెస్ట్ వేరు, హార్ట్ స్ట్రోక్ వేరు అని వైద్య నిపుణులతో చర్చించిన మంత్రి మరో నిర్ణయం కూడా తీసుకున్నారు.

సీఆర్పీపై శిక్షణ…

ఇప్పటి వరకు పోలీసు విభాగంతో పాటు హైదరాబాద్ కే పరిమితం అయిన సీఆర్పీ అవగాహన కార్యక్రమాన్ని కరీంనగర్ లోనూ ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ విభాగాల యంత్రంగానికి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వాలని కూడా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు మంత్రి గంగుల. గుండె పోటు వస్తే బీపీ, పల్స్ పూర్తిగా హెచ్చుతగ్గులకు చేరుకోవని ఆసుపత్రికి వెల్లి చికిత్స అందించుకునే అవకాశం ఉంటుంది కానీ కార్డియాక్ అరెస్ట్ అయితే మాత్రం వారికి వెంటనే సీఆర్పీ చేయాల్సి ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నందున కరీంనగర్ అంతటా సీఆర్పీపై అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవడమే కాదు… కిందపడిపోయిన వారిని చూసి హైరానా పడకుండా వారిని కాపాడేందుకు సీఆర్సీ చేయాలన్న విషయంపై చైతన్యం నింపాలని సూచిస్తున్నారు.

You cannot copy content of this page