మద్దిమడుగులో మిస్… చల్పాకలో ట్రేస్…

భద్రు కోసం కొనసాగిన బలగాల వేట...

దిశ దశ, దండకారణ్యం:

రిహద్దు అటవీ ప్రాంతాల్లో సంచరిస్తూ పార్టీ పునర్నిమాణం కోసం ప్రయత్నిస్తున్న మావోయిస్టు పార్టీ కమాండర్ కురుసం మంగు ఉరఫ్ భద్రు అలియాస్ పాపన్న కోసం గత ఆరు నెలలుగా బలగాలు ప్రత్యేకంగా  గాలింపు చర్యలు చేపట్టాయి. భద్రు తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోకి గతంలో కూడా వచ్చి వెల్తున్నాడన్న సమాచారం ఉన్నప్పటికీ బలగాలు అతని కోసం అంతగా పట్టించుకోలేదు. ఆయన ఎక్కువగా దండకారణ్యంలోనే ఉంటున్నాడని గుర్తించారు. అయితే ఇటీవల కాలంలో భద్రు కార్యకలాపాలు సరిహద్దు ప్రాంతంలో ఎక్కువ కావడంతో బలగాలు స్పెషల్ ఆపరేషన్ చేపట్టాయి. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసు అధికారులు భద్రు టీమ్ కోసం అడవులను జల్లెడ పట్టాయి.

మద్దిమడుగులో…

భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని మద్దిమడుగుతో పాటు గుత్తికోయల గూడెల్లోకి భద్రు వచ్చి వెల్తున్నాడన్న సమాచారాన్ని పోలీసులు అందుకున్నారు. భద్రాద్రి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకే పరిమితం కావల్సిన భద్రు కార్యకలాపాలు మహదేవపూర్ ఏరియాకు కూడా విస్తరించడానికి కారణం ఏంటన్న కోణంలో పోలీసులు ఆరా తీశారు. అప్పటికే పోలీసులు గొత్తి కొయల గూడెలాపై గట్టి నిఘా వేశారు. గొత్తి కోయలకు సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించిన ఆయా ప్రాంతాల పోలీసులు కొత్త వ్యక్తుల రాకపోకలు, ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్న వారు ఏఏ ప్రాంతాల్లో తిరుగుతున్నారోనన్న విషయాలు తెలుసుకునే పనిలో పడ్డారు. అంతేకాకుండా కార్డన్ సెర్చ్ వంటి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు పోలీసు దర్బార్ లు కూడా గొత్తి కోయల కోసం ప్రత్యేకంగా నిర్వహించే సాంప్రాదాయానికి శ్రీకారం చుట్టారు పోలీసులు. ఈ క్రమంలోనే భద్రు తరుచూ మద్దిమడుగు అటవీ ప్రాంతంలోని గొత్తి కోయల వద్దకు వచ్చి వెల్తున్నాడన్న సమాచారం అందుకున్నారు పోలీసులు.

గట్టి నిఘా…

భద్రు కదలికలపై సరిహధ్దు జిల్లాల పోలీసు అధికారులు సమన్వయంతో సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టినట్టుగా తెలుస్తోంది. నెలరోజుల క్రితం భద్రు ఖచ్చితంగా మద్దిమడుగుకు వస్తున్నాడన్న సమాచారం అందుకుని భారీగా బలగాలను మోహరింపజేశారు. రాత్రి నుండి తెల్లవారే వరకు కూడా భద్రు కోసం పోలీసులు కాపు కాచినప్పటికీ ఆయన ఆచూకి లభ్యం కాలేదు. అయితే భద్రు ఖచ్చితంగా మహాముత్తారం మండల అటవీ ప్రాంతంలోనే తారసపడే అవకాశం ఉందని జిల్లా పోలీసు యంత్రాంగం అంచనా వేసింది. ఈ ప్రాంతానికి చెందిన పోలీసు అధికారులు ప్రత్యేకంగా సమాచార వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే అనూహ్యంగా ములుగు జిల్లా ఏటూరునాగారం సమీపంలోని చల్పాక అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో భద్రు చనిపోయారు. ఈ ఎన్ కౌంటర్ వల్ల మావోయిస్టు పార్టీ రెండు ఏరియా కమిటీల కీలక బాధ్యులను కోల్పోయింది. నర్సంపేట, ఇల్లందు ఏరియా కమిటీ కార్యదర్శిగా, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఉన్న భద్రు, ఏటూరునాగారం, మహాదేపూర్ ఏరియా కమిటీ కార్యదర్శిగా, జిల్లా కమిటీ సభ్యునిగా పని చేస్తున్న ఎగులోపు మల్లయ్య అలియాస్ మధు ఉరఫ్ కోటీ మరణించడంతో సరిహద్దు ప్రాంతాల్లోని రెండు కీలక కమిటీల కార్యకాలాపాలకు బ్రేకు పడినట్టయింది. మావోయిస్టు పార్టీ ఈ ప్రాంతంలో పునర్నిమాణం కోసం కొత్త నాయకత్వానికి బాధ్యతలు అప్పగించాల్సిన ఆవశ్శకత ఏర్పడింది.

You cannot copy content of this page