హ్యాట్రిక్ విజయం తథ్యం: బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్

దిశ దశ, అంతర్జాతీయం

ఈ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించి తీరుతుందని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ శ్రేణులు వెల్డించాయి. అమెరికాలోని డల్లాస్ లో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ఎన్ఆర్ఐలు బీఆర్ఎస్ కు అనుకూలంగా కార్యక్రమం నిర్వహించారు. డల్లాస్ లోని గాంధీ విగ్రహం వద్ద గల అలిబాబా లాంజ్ వద్దకు చేరుకున్న తెలంగాణ ఎన్ఆర్ఐలు పెద్ద తెలంగాణాలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ గెలవాలని ఆకాంక్షించారు. అమెరికా కాలమానం ప్రకారం నవంబర్ 11 ఉదయం 11 గంటల సమయంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ మెజార్టీ సాధించి విజయదుంధిబి మోగిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. సాఫ్ట్ వేర్ రంగం నుండి మొదలు అన్ని రంగాల్లో కూడా 9 ఏళ్లలో తెలంగాణ రూపు రేఖలను మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. అలాగే ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందించడంతో పాటు పుట్టక నుండి చావు వరకు ఎదో రకంగా తెలంగాణ ప్రభుత్వం ద్వారా ప్రజలకు బాసటనివ్వాలన్న లక్ష్యంతో స్కీంలను ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. చాలా అరుదైన క్రెడిట్ దక్కించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కే పట్టం కట్టాలని తెలంగాణ ప్రజలను ఎన్ఆర్ఐలు కోరారు. ముచ్చటగా మూడో సారి బీఆర్ఎస్ పార్టీకి విజయాన్ని అందించినట్టయితే అన్ని రంగాల్లోనూ దూసుకపోయి అన్ని ప్రాంతాల వారికి దిక్సూచిలా ఆదర్శంగా నిలవబోతోందన్నారు. సమైక్య రాష్ట్రం నుండి విడిపోయిన తరువాత తెలంగాణ అభివృద్ది చెందదని వ్యాఖ్యానించిన వారికి కనువిప్పు కలిగేలా రాష్ట్ర అభివృద్ది చెందిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కారణంగా తెలంగాణ అభ్యున్నతి వైపు దూసుకోపోగా, మంత్రి కేటీఆర్ నిరంతరం శ్రమిస్తూ సాంకేతిక రంగాన్ని ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొస్తున్నారన్నారు. ఇందుకు ఉదహారణే కోకాపేటలో ఎకరం భూమికి రూ. 100 కోట్లకు పలకడమేనని ఎన్ఆర్ఐలు అన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి మరోసారి బాసటగా నిలిస్తే భవిష్యత్తు తరాలకు కూడా మంచి జరుగుతుందని వారన్నారు.

You cannot copy content of this page