జగిత్యాలలో భక్తుల సాంప్రాదాయం…
దిశ దశ, జగిత్యాల:
కాశీ విశ్వనాథుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వెల్తుంటారు. అయితే అక్కడకు వెల్లే భక్తులు చాలా మంది కూడా విశ్వనాథుడి కన్నా ముందు కాల భైరవుడిని దర్శించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. అనంతరం కాశీలో ఉన్న మృత్యుంజయ మందిరంతో పాటు వివిధ ఆలయాలల్లో భక్తులు పూజలు చేసుకుని ఇంటికి చేరుకుంటారు. కాశీ యాత్ర ముగించుకుని వచ్చిన వారికి కొన్ని ప్రాంతాల్లో ఇంటిల్లిపాది కూడా మంగళ హారతులతో ఆహ్వానం పలకడం ఆనవాయితీగా వస్తోంది. పూర్వ కాలంలో కాశీ యాత్ర చేసి తిరిగి ఇంటికి చేరడమంటే మిరాకిల్ జరిగినట్టేనని అనుకునే వారు. అప్పుడు ‘‘కాశీకి వెల్తే కాటికి’’ చేరినట్టే అన్న నానుడి కూడా వాడుకలో ఉండేది. గతంలో రహదారి సౌకర్యాలు లేకపోవడంతో కాశీకి వెల్లే భక్తులు నెలల తరబడి ప్రయాణం చేయాల్సి వచ్చేది. దీంతో కాశీ పుణ్య క్షేత్ర దర్శనం చేయడం అంటే అత్యంత గొప్ప విషయంగా భావించే వారు నాడు. ఈ కారణంగానే కాశీకి వెల్లి తిరిగి వచ్చిన వారికి పూజలు చేసే సాంప్రాదాయం కొనసాగేది. అయితే తాజాగా తెలంగాణాలో మరొకొత్త ఆచారం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కేంద్రంలో కాశీకి వెల్లొచ్చిన వారు కాల భైరవ ప్రతిరూపంగా భావించే శునకానికి ప్రత్యేక పూజలు చేసే ఆనవాయితీ కొనసాగుతోంది. కాశీ పర్యట ముగించుకుని వచ్చిన పట్టణంలోని వాణి నగర్ కు చెందిన నాగమల్ల రాజేశం, అనంతలక్ష్మీ దంపతులు కాలభైరవుడి రూపంగా భావించే శునకానికి ప్రత్యేక పూజలు చేశారు. కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో కాలభైరవుని ప్రతిరూపమైన శునకానికి ఆయన దర్శనం అనంతరం స్వస్థలానికి చేరుకున్న తరువాత్ ప్రత్యేక పూజలు చేయడం తమ ఆనవాయితీ అని వారు తెలిపారు. పట్టణంలోని తులసి నగర్ లో నివాసం ఉంటున్న ఆకుల నాగరాజు ఇంటికి వెల్లి శునకానికి ప్రత్యేకంగా తీర్చిదిద్ది పాద పూజ కూడా చేశారు. పూర్వీకుల నుండి వస్తున్న ఈ ఆనవాయితీని అవలంభిస్తున్నామని భక్తులు వివరించారు. కాశీ విశ్వేశరుడిని దర్శించుకుని వచ్చిన తరువాత ప్రత్యేకంగా శునకానికి పూజలు చేయడం మాత్రం స్థానికులను ఆశ్యర్యపరిచింది.