దిశ దశ, హైదరాబాద్
సంక్రాంత్రి పర్వదినం పురస్కరించుకుని దక్షిణ మధ్య ప్రత్యేకంగా రైళ్లను నడిపిస్తున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్న ఏపీ ప్రజలు తమ స్వస్థలాలకు వెల్లనున్నందున ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నెల 11, 12, 13వ తేదీల్లో ఈ రైళ్ల నడుస్తాయని వెల్లడించింది. ఈ నెల 11న ట్రైన్ నంబర్ 7021 సికింద్రాబాద్ నుండి రాత్రి 9 గంటలకు బయలుదేరి మరునాటి ఉదయం 8 గంటలకు చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది. ట్రైన్ నంబర్ 7022, 12వ తేది సాయంత్రం 5.40 గంటలకు కాకినాడ నుండి బయలుదేరి మరునాటి ఉదయం సికింద్రాబాద్ కు 5.55 గంటలకు చేరుకుంటుంది. అలాగే ట్రైన్ నంబర్ 7023 హైదరాబాద్ నుండి 12వ తేది సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరి మరునాటి ఉదయం కాకినాడ టౌన్ కు 7.10 గంటలకు చేరుకుంటుంది. 13 రాత్రి 10 గంటలకు 7024 నంబర్ ట్రైన్ కాకినాడ టౌన్ నుండి బయలు దేరి మరునాటి ఉదయం 8.30 గంటలకు చేరుకుంటుంది.
రూట్ల వివరాలివే…
7021, 7022 నంబర్ రైళ్లు జనగాం, ఖాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోటల మీదుగా రాకపోకలు సాగిస్తాయి. 7023, 7024 ట్రైన్లు సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు జంక్షన్, విజయవాడ జంక్షన్, గుడివాడ జంక్షన్, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోటల మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ఈ స్పెషల్ ట్రైన్లలో ఏసీ టూ, త్రీ టైర్ కోచులు, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ సిట్టింగ్ కోచులు ఉంటాయని కూడా వివరించింది.
అలాగే మరిన్ని ట్రైన్ల వివరాలను కూడా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు అప్ డేట్ చేశారు.. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ వివరాలు ఇవే…