దిశ దశ, మహారాష్ట్ర:
మరో ఏడు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మహారాష్ట్రంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చింది బీజేపీ పార్టీ. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కుటుంబానికి చెందిన అజిత్ పవార్ ఆద్వర్యంలో 30 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి అండగా నిలిచారు. చకా చకా రాజకీయ పరిణామాలు మారిపోవడం బీజేపీతో జట్టు కట్టిన అజిత్ పవార్ కు డిప్యూటీ సీఎం, మరికొంత మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం కూడా చేసేశారు. నాటకీయ పరిణామాలతో ఎన్సీపీ ఢీలా పడిపోయిందనే చెప్పాలి.
ఎన్నికల దృష్టిలో పెట్టుకోనేనా..?
వచ్చే జనవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బలంగా ఉన్న ఎన్సీపీని డిఫెన్స్ లో పడేయడం వల్ల బీజేపీకి లాభిస్తోందన్న అంచనాలతోనే కమలనాథులు వ్యూహాత్మక ఎత్తుగడ వేసినట్టుగా అర్థం అవుతోంది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తనయుడినే తమకు అనుకూలంగా మల్చుకోవడం వల్ల వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ చావు దెబ్బ తింటుందన్న అంచనాలతో బీజేపీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో ఏక ఛత్రాదిపత్యం చెలాయించేందుకు బీజేపీ అటు శివసేన, ఇటు ఎన్సీపీలను చీల్చే పనిలో నిమగ్నం అయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా మహారాష్ట్రలో అత్యంత బలమైన ఎన్సీపీలో చీలిక రావడం బీజేపీకి లాభించే అంశమేనని చెప్పొచ్చు.