ఆడిపాడిన ఆర్టీసీ ఉద్యోగులు…

దిశ దశ, కరీంనగర్:

ప్రయాణీకులను సేఫ్టీగా గమ్యం చేర్చాలన్న ఆలోచనతో డ్రైవర్లు… టికెట్ టికెట్ అంటూ బస్సంతా కలియ తిరిగే కండక్టర్లు నిత్యం టెన్షన్ లైఫ్ లోనే కాలం వెల్లదీస్తారు. ప్రమాదాలు జరగకుండా వేళకు గమ్యాన్ని చేర్చాలన్న యోచనలో డ్రైవర్లు ఉంటే… బస్సెక్కిన ప్రతి ఒక్కరికి టికెట్ ఇచ్చి ఎస్ ఆర్ ఫిల్ చేసే పనిలో నిమగ్నం అవుతారు. అంతలోనే మరో స్టేజీ రాగానే మళ్లీ షరా మామూలే అన్నట్టుగా విధుల్లో నిమగ్నం అవుతారు. విధి నిర్వహణలో టెన్షన్ గానే కొనసాగుతుంది వారి జీవితం. అయితే ఆర్టీసీ ఉద్యోగుల్లో మానసికోల్లాసం నింపినట్టయితే వారి ఆరోగ్యాలు బావుంటాయని ఏటా యాజమాన్యం క్రీడలు నిర్వహించే విధానాన్ని అవలంభిస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం కరీంనగర్ వన్ డిపోలోని ఉద్యోగుల కోసం క్రీడా పోటీలను నిర్వహించారు. మహిళా ఉద్యోగులు కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ పోటీల్లో పాల్గొన తమలోని ప్రతిభను కనబర్చారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ రీజియన్ మేనేజర్ సుచరిత, డిపో మేనేజర్ విజయ మాధూరి, అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) షేక్ నజీర్, సూపర్ వైజర్లు కిషన్, ఏవిఆర్ రెడ్డి, వెంకటేశం, బాపన్న, మనోహార్ లతో పాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.

You cannot copy content of this page