కాళేశ్వరం విషయంలో తొందరపాటు సరికాదు
దిశ దశ, భూపాలపల్లి:
నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీకి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక లేఖ రాసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటన వెలుగులోకి వచ్చిన తరువాత ఎన్టీఎస్ఏ టీమ్ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. తాజాగా డ్యాం సేఫ్టీ నిపుణల బృందం ఇచ్చిన నివేదికను ఊటంకిస్తూ తెలంగాణ ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ లేఖ రాశారు. ఇందులో పలు అంశాలను లేవనెత్తుతూ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నిరాధారమైన ఆరోపణలు చేశారన్నారు.
అన్నీ డాక్యూమెంట్లు ఇచ్చాం…
నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం 20 అంశాల గురించి వివరాలు అడగగా తాము 17 అంశాలపై అక్టోబర్ 29న మెయిల్ చేశామని మిగతా మూడు అంశాలకు సంబంధించిన డాక్యూమెంట్లు నవంబర్ 1న ఇచ్చామని రజత్ కుమార్ వివరించారు. అయితే తాము అందించిన డాక్యూమెంట్లు ఏవీ కూడా పరీక్షంచకుండానే ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిందన్నారు. లక్ష్మీ బ్యారేజీ కుంగిపోవడానికి కారణాలు ఏంటీ అన్న విషయాలపై అధ్యయనం చేయకుండానే నివేదిక ఇవ్వడం ఆశ్యర్యం కల్గించిందని, నీరు తగ్గిన తరువాతే గ్రౌండ్ లెవల్లో ఏం జరిగిందో తెలుసుకునే అవకాశం ఉంటుందని మీరు వివరించారని, ఇందులో భాగంగా నీటిని మళ్లించేందుకు మీరు సూచించినట్టుగా కాపర్ డ్యాం నిర్మించే పనిలో నిమగ్నం అయ్యామన్నారు. నీటిని పూర్తిగా దారి మళ్లించినట్టయితేనే బ్యారేజీలో పిల్లర్లు కుంగిపోవడానికి కారణాలు అంచనా వేసే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇచ్చిన నివేదికలను మేం అంగకరించబోమని రజత కుమార్ స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజీలో అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ సెకాంట్ పైల్స్ కు మెయిన్ కన్సట్రక్షన్ కు ఫ్లెక్సిబుల్ జాయింట్ కోసం ప్రోటోటైప్ను సీడబ్లూసీ అభివృద్ది చేసిందని, ఇదే విధానాన్ని ఉత్తరాఖండ్ లోని తపోవన్ ప్రాజెక్టులో కూడా పాటించారన్నారు. దీనివల్ల బ్యారేజీపై పడే భారం నేరుగా పడకుండా ఉండేందుకు దోహదపడుతుందన్నారు. వర్చువల్ మోడ్ లో ప్రాజెక్టును సంబంధిత ఆనకట్టల జాబితాలో చేర్చేందుకు ఎస్డీఎస్ఏ, ఎన్డీఎస్ఏను అభ్యర్థించినప్పుడు మెయిల్ ద్వారా మొత్తం వివరాలను పంపించామన్నారు. ఆ తరువాత రాష్ట్ర డ్యాం సేఫ్టీ ఆర్గనైజేసన్ ను ఎన్డీఎస్ఏ అభినందించడంతో పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను జాబితాలో కూడా చేర్చారన్నారు. కాళేశ్వరం విషయంలో డ్యాం సేఫ్టీ యాక్టు 2021 ప్రకారం నడుచుకుంటున్నామని వెల్లడించారు. అలాగే సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను ఎన్డీఎస్ఏ బృందం సందర్శించకున్నప్పటికీ వాటి నిర్మాణంపై చేసిన వ్యాఖ్యలు సరికాదంటూ రజత్ కుమార్ ఆ లేఖలో పేర్కొన్నారు. కాళేశ్వరం విషయంలో అన్ని అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే హైడ్రాలజీ, కాస్టింగ్, ఇరిగేషన్, ప్లానింగ్, పర్యావరణ అనుమతులకు జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన సాంకేతిక సలహా కమిటీ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిందన్నారు. జూన్ 6 2018న ఈ మేరకు నిర్ణయం తీసుకుందని, ప్రాజెక్టు వ్యయంతో పాటు యాక్షన్ ప్లాన్ గురించి జల సంఘం ఛైర్మన్ మసూద్ హుస్సేన్, సీడబ్లూసీ ఇంజనీర్ల బృందం క్షేత్ర స్థాయిలో పరిశీలించి మెచ్చుకుందన్నారు. స్టేట్ ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కూమార్ సుదీర్ఘంగా రాసిన ఈ లేఖపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.