మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటన
దిశ దశ, నిజామాబాద్:
రెడ్డి, వైశ్య కార్పోరేషన్లు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం రాజా బహుద్దూర్ వెంకట్రామిరెడ్డి 156వ జయంతి పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పథకాలను రూపొందిస్తున్నారని, అట్టడుగు వర్గాలను పైకి తీసుకరావాలన్న సంకల్పంతోనే ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారన్నారు. రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో రెడ్డి స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. అలాగే ఆర్ బివిఆర్ఆర్ పేరిట డీమ్డ్ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారన్నారు. ఇందు కోసం ఇప్పటికే రూ. 1500 కోట్ల విలువ చేసే 15 ఎకరాల భూమిని కూడా కెటాయించినట్టు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మధుసూధన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు పోరెడ్డి శంతన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఉప్పల్ రెడ్డి, మాధవరెడ్డి, సాయిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Disha Dasha
1884 posts
Prev Post