ఈటలకు ఇంకా నో సెక్యూరిటీ… వై సెక్యూరిటీ ఎప్పుడో మరి..?

దిశ దశ, హైదరాబాద్:

రాష్ట్ర బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ సెక్యూరిటీని అప్ గ్రేడ్ చేయనట్టుగా తెలుస్తోంది. ఆయనకు వై కేటగిరీలో శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. శుక్రవారం తీసుకున్న ఈ నిర్ణయం మేరకు శనివారం ఉదయం నుండే అమల్లోకి వస్తుందని కూడా ప్రచారం జరిగింది. ఈ కేటగిరి కింద రాజేందర్ కు 11 మంది గార్డులను ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే శుక్రవారం సాయంత్రం హాడావుడి చేసిన సర్కారు ఆ తరువాత ఈ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. మేడ్చల్ డీసీపీ సందీప్ రావు రెండు రోజుల పాటు శామీర్ పేటలోని రాజేందర్ ఇంటి వద్దకు వెల్లి పరిశీలించడంతో పాటు ఆయ నుండి వివరాలు కూడా సేకరించారు. ఈ మేరకు నివేదికను డీజీపీకి పంపించడంతో రాజేందర్ కు సెక్యూరిటీ ఇచ్చే విషయంపై ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. అయితే రెండు రోజులు అయినప్పటికీ రాజేందర్ మాత్రం రెగ్యూలర్ సెక్యూరిటీతో నే ఉన్నారు. ఆయనకు గతంలో కెటాయించిన ఇద్దరు గన్ మెన్లు మాత్రమే డ్యూటీ చేస్తుండగా వాహనం కూడా తన సొంతదే వినియోగిస్తున్నారు. దీంతో రాజేందర్ కు సెక్యూరిటీ కల్పించే విషయంలో అధికారులు పునరాలోచనలో పడ్డారా లేక మరోదైన కారణమా అన్న చర్చ జరుగుతోంది. రాజేందర్ సెక్యూరిటీ విషయంలో మంత్రి కేటీఆరే జోక్యం చేసుకోవడంతో రాజేందర్ కు భద్రత కట్టుదిట్టం కానుందని భావించారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయనకు సెక్యూరిటీ అందించే చర్యలు జరుగుతున్నట్టుగానే లేకపోవడం విస్మయం కల్గిస్తోంది.

శంకరమ్మలా..?

శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఎమ్మెల్సీ ఖాయం అయిందని, ఆమెకు గన్ మెన్లు, పీఏలను కూడా అలాట్ చేశారన్న ప్రచారం రాష్ట్రమంతా గుప్పుమంది. అమరవీరుల కుటుంబాలను అక్కున చేర్చుకున్నట్టయితే ప్రభుత్వంపై ఉన్న అపవాదును శంకరమ్మకు ఎమ్మెల్సీ ఇవ్వడంతో దూరం చేసుకున్నట్టవుతుందని సీఎం భావిస్తున్నారంటూ ప్రచారం జరిగింది. కొత్త సచివాలయం ముందు ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం ప్రారంభోత్సవానికి ఒక రోజు ముందు జరిగిన ఈ హాడావుడి అంతా ఇంతా కాదు. కానీ చివరకు అదంతా వట్టిదేనని తేలిపోయింది. ఇప్పుడు ఈటల విషయంలో కూడా ఇదే పంథా కొనసాగుతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనకు సెక్యూరిటీ ఇస్తున్నట్టుగా లీకులు ఇచ్చి ఆ తరువాత వెనక్కి తగ్గడం చూస్తుంటే శంకరమ్మ విషయంలో జరిగినట్టుగానే అనిపిస్తోంది. ఈ వ్యవహారంలో ఈటల రాజేందర్ కూడా బిగ్ ట్విస్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కెటాయించే సెక్యూరిటీని రిజెక్ట్ చేసే ఆలోచనలో ఈటల రాజేందర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే నిజమైతే ఆయనకు కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించే అంశంపై నిర్ణయం తీసుకోవల్సి ఉంటుంది.

You cannot copy content of this page