దిశ దశ, అంతర్జాతీయం:
అమెరాకాలో వ్యభిచారం కేసులో భారతీయులు పలువురు పట్టుబడ్డారు. హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, అక్కడి పోలీసుల సహకారంతో చేపట్టిన స్టింగ్ ఆపరేషన్ లో వీరిని పట్టుకున్నారు. వ్యభిచారం చేయిస్తున్న వారిలో 18 మంది పట్టబడగా అందులో భారతీయులు ఏడుగురు ఉన్నారు. వీరిలో ఐదుగురు తెలుగు వారు కావడం గమనార్హం. టెక్సాస్ లని డెంటన్ లో ఈఘటన జరిగింది. వీరిలో నిఖిల్ బండి, మెనిష్ గల్ల, నిఖిల్ కుమ్మరి, జై కిరణ్, మేకల, కార్తిక్ రాయపాటిలు ఉన్నారని అమెరికా మీడియా వర్గాలు తెలిపాయి. ఓ మైనర్ ను కూడా వ్యభిచారం చేయాలని ప్రోద్భలం చేసిన ఆరోపణలు కూడా వీరిలో ఒకరు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కాలంలో విదేశాల్లో తెలుగు వారు నేరాలకు పాల్పుడుతండడం సంచలనంగా మారింది. ఓ స్టోర్స్ లో తెలుగు యువతులు ఇద్దరు చోరీకి పాల్పడ్డ ఆరోపణలు అప్పట్లో సంచలనంగా మారాయి. మరో వైపున అమెరికాలోనే పెద్ద ఎత్తున యువతి, యువకులను పిలిపించుకుని ఓ ఇంట్లో షెల్టర్ ఇచ్చిన వ్యవహారంపై పోలీసులు దాడులు చేశారు. భారీ నెట్ వర్క్ ఏర్పాటు చేసుకుని ఇక్కడి వారు అంతర్జాతీయంగా నేరాల్లో దొరుకుతుండడం సంచలనంగా మారింది.