ఉచిత విద్యా, వైద్యం అమలు చేయండి: ఇతర ఉచితాలను తొలగించండి

దిశ దశ, కరీంనగర్:

అన్ని పథకాలు ఉచితమని ప్రచారం చేసుకుంటూ అధికారంలోకి వస్తున్న ప్రభుత్వాల తీరు సరికాదన్న అభిప్రాయాలు ఓ వర్గలో నెలకొన్నాయి. కేవలం విద్యా, వైద్యం మాత్రమే ఉచితంగా అందిస్తే సరిపోతుందన్న వాదనలు కూడా నెలకొన్నాయి. ఇటీవల కాలంలో ఎన్నికల్లో ఉచితాల ఎరతో సాగుతున్న పొలిటికల్ పార్టీల ప్రచారం కూడా పీక్స్ కు చేరింది. ఉచితాల వల్ల అటు ప్రభుత్వాల ఆర్థిక పరిపుష్టికి సవాల్ విసురుతుంటే, ఇటు సాధారణ పౌరులు కూడా ఉచితాలకు అలవాటు పడిపోతుండడం ఆందోళనకరంగా మారిందని మేథావులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యలో కరీంనగర్ చింతకుంటకు చెందిన ఓ యువకుడు ఉచితాలు వద్దు అన్న నినాదంతో ఛలో ఢిల్లీ పేరిట సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టాడు.

ఆయన డిమాండ్ ఇదే…

కరీంనగర్ సమీపంలోని చింతకుంటకు చెందిన బెల్లపు కర్ణాకర్ సోమవారం కరీంనగర్ నుండి సైకిల్ యాత్ర చేపట్టారు. ముందుగా హైదరాబాద్ ధర్నా చౌక్ కు చేరుకుని అక్కడి నుండి ఢిల్లీలోని జంతర్ మంతర్ కు అక్కడి నుండి ప్రధాని కార్యాలయానికి వెల్లి వినతి చేసేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంగా బెల్లపు కర్ణకర్ మాట్లాడుతూ… అన్నింటా ఉచిత పథకాలు ఏర్పాటు చేయడం సరికాదన్నారు. అనవసరపు ఉచితాలు వద్దు ప్రామాణిక విద్యా, వైద్యమే ముద్దన్నారు. అందరికీ నాణ్యాతా ప్రమాణాలతో కూడిన కార్పోరేట్ విద్య, కార్పోరేట్ వైద్యం అందించినట్టయితే అన్నింటా మంచిదన్నారు. సైకిల్ యాత్ర ద్వారా మార్గ మధ్యలో కలిసిన వారిని చైతన్య పర్చే ప్రయత్నం కూడా చేస్తానన్నారు. అనుచిత ఉచితాల పథకాల అమలుకు నిభందనలతో కూడిన బిల్లును, అందరికీ ఉచిత కార్పోరేట్ విద్యా, వైద్యం అందించే విధంగ పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టాలని ప్రధానమంత్రి కార్యాలయంలో వినతి చేయనున్నానని వివరించారు.

You cannot copy content of this page