“ఇనుముల” కేసుల దర్యాప్తు ఆపండి

హైకోర్టు ఆదేశాలు

దిశ దశ మంథని:

పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మంథని మాజీ ఉప సర్పంచ్ ఇనుముల సత్యనారాయణ(సతీష్)పై నమోదు చేసిన నాలుగు కేసుల్లో దర్యాప్తు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తనపై కేసులు నమోదు చేస్తున్నారని రక్షణ కల్పించాలని ఇనుముల సతీష్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మంథని మాజీ ఎమ్మెల్యేపై గతంలో తాను కోర్టును ఆశ్రయించిన విషయం దృష్టిలో పెట్టుకుని తనపై కేసులు పెట్టిస్తున్నారన్నారు. మంథని, రామగిరి పోలీసు స్టేషన్లలో నమోదు చేసిన కేసుల్లో తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. మాజీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు లేని పోని ఆరోపణలు చేస్తున్నారని హైకోర్టుకు విన్నవించారు. ఇందులో భాగంగా పది రోజుల వ్యవధిలో నాలుగు కేసులు నమోదు చేశారని తెలిపాడు. ఈ మేరకు రిట్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఆ నాలుగు కేసుల దర్యాప్తు నిలిపివేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ “COERCIVE STEPS” తీసుకోరాదని స్పష్టం చేసింది.

You cannot copy content of this page