ఏపీలో విచిత్ర రాజకీయాలు…

దిశ దశ, ఏపీ బ్యూరో:

ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ చాలా డిఫరెంట్ గా సాగుతున్నాయి. అన్నో పార్టీ… చెల్లో పార్టీ… అల్లుడు మరో పార్టీ ఇలా కొనసాగుతున్నాయి అక్కడి రాజకీయాలు. పోలీంగ్ తేది సమీపిస్తున్న వేళ అక్కడి రాజకీయ నాయకులకు అండగా నిలుస్తున్న నేతల తీరు అత్యంత విచిత్రంగా ఉందనే చెప్పాలి. కొన్ని ప్రాంతాల్లో తండ్రికి వ్యతిరేకంగా తనయుడు ప్రచారం చేస్తూంటే మరో చోట తండ్రి నిర్ణయాన్ని తనయ వ్యతిరేకిస్తోంది. రాజకీయాల్లో వర్గ పోరు సాధారణమే అయినప్పటికీ ఏకంగా రక్త సంబంధాలను కూడా కాదనుకునే స్థాయికి చేరుకోవడమే ఆశ్యర్య పరుస్తోంది.

మెగా ఫ్యామిలీ…

కాంగ్రెస్ పార్టీ తమ నేత అని ఇంతకాలం నమ్మకున్నప్పటికీ ఎన్నికలు సమీపించిన సమయంలో మెగస్టార్ ఆ పార్టీ నేతలకు ఝలక్ ఇచ్చారు. తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నానని ప్రకటించిన చిరంజీవి తమ్మడు పవణ్ కళ్యాణ్ ను గెలిపించాలని మాత్రం పిలుపునిచ్చారు. ఏన్డీఏ భాగస్వామ్య పార్టీలో కొనసాగుతున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ ఆశలు వదులుకున్నారు. పవన్ కళ్యాణ్ కోసం శనివారం చిరంజీవి కొడుకు రాంచరణ్, ఆయన భార్య సురేఖ, అల్లు అరవిందులు పిఠాపురం చేరుకున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే చేవేళ్ల బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశర్ రెడ్డిని గెలిపించాలని చిరంజీవి పిలుపునిచ్చారు. తన కోడలు ఉపాసన తరుపున బంధుత్వం ఉండడంతో పాటు అపోల్ గ్రూప్స్ భాగస్వామి కూడా అయినా కొండ విశ్వేశర్ రెడ్డికి అనుకూలంగా మెగాస్టార్ ఓ వీడియో కూడా విడుదల చేయడం గమనార్హం. ఇకపోతే చిరంజీవికి స్యయాన బావమరిది అయిన అల్లు అరవింద్ తమ్ముడు అల్లు అర్జున్ మాత్రం వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు.

వైఎస్ ఫ్యామిలీ…

వైఎస్ కుటుంబంలోనూ ఇదే పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయకుడు జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్సీపీ అధినేతగా ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్నికల సమరాంగణంలో అమితుమీ తేల్చుకునేందుకు సిద్దమయ్యారు. ప్రత్యర్థి పార్టీలను మట్టి కరిపించి మరోసారి అధికారంలోకి రావలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. అయితే ఆయన సోదరి షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి అన్నకు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టారు. రాష్ట్రంలో ఉనికి లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీకి జీవం పోయాలని తపిస్తున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియదు కానీ ఆమె ఎంపీగా పోటీ చేస్తున్న కడప ప్రజలను అభ్యర్థిస్తూ అమెరికాలో ఉన్న వీరి తల్లి విజయమ్మ ఓ వీడియో విడుదల చేశారు. తన కూతురు షర్మిలను ఎంపీగా గెలిపించాలని కోరుతూ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రచారం ముగియడానికి కొన్ని గంటల ముందు విజయమ్మ ఈ వీడియోను విడుదల చేయడం సంచలనంగా మారింది.

ఒకే కుటుంబానికి చెందిన వారు వేర్వేరు పార్టీల్లో కొనసాగుతుండడమే విచిత్రమంటే వారి కుటుంబాలకు చెందిన వారు మద్దతుగా నిలుస్తున్న తీరు మరింత విచిత్రంగా మారింది ఆంధ్రానాట. మధ్యప్రదేశ్ ల్ భార్య ఎమ్మెల్యే అయితే భర్త బీఎస్పీ ఎంపీగా బరిలో నిలవడం దేశంలోనే సంచలనంగా మారింది. అయితే ఏపీలో మాత్రం ఒకే కుటుంబానికి చెందిన వారు వేర్వేరు పార్టీల్లో కొనసాగడం, వేర్వేరు పార్టీల అభ్యర్థులకు మద్దుతునిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది.

You cannot copy content of this page