రతి మన్మథుడి వరం కోసం… రతి వేషంలో మన్మథులు…

దిశ దశ, ఏపీ బ్యూరో:

హోలీ పౌర్ణమి వస్తుందనగానే సప్తవర్ణ శోభితమయం చేయాలన్న ఉత్సుకత ప్రతి ఒక్కరిలో ఉంటుంది. హోలీ పర్వదినాన రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకుంటారు. పెద్ద చిన్నా అన్న తేడా లేకుండా ఆనందంలో మునిగి తేలుతుంటారు. ఇదంతా కూడా దేశమంతటా కూడా ఇలాగే ఈ వేడుకును నిర్వహించుకుంటారు. అయితే ఇందుకు పూర్తి భిన్నమైన వాతావరణం అక్కడ సాక్షాత్కరిస్తోంది. అంగ రంగులు చల్లుకోడానికి ప్రాధాన్యత మాత్రం ఇవ్వరు. అనాదిగా వస్తున్న అత్యంత విచిత్రమైన సాంప్రాదాయాన్ని పాటిస్తున్నారు. అత్యంత వైవిద్యంగా సాగుతున్న ఈ తంతు గురించి తెలిస్తే మీరూ ఔరా అంటూ ముక్కున వేలేసుకుంటారు.

ఏపీలోనే…

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా అధోని మండలం సంతేకుళ్లురు గ్రామంలో తరతరాలుగా వస్తున్న ఈ సాంప్రాదాయాన్ని నేటికీ పాటిస్తున్నారు. హోలీ పర్వదినం రోజున గ్రామంలోని మగవారు అంతా కూడా స్త్రీ వేషధారణ చేస్తారు. పాయింటు షర్ట్, లుంగిలను పక్కపడేసి తెలుగుదనం ఉట్టిపడేలా చీరకట్టుతో తయారవుతారు. మహిళల్లాగానే కట్టుబొట్టు పెట్టుకుని గ్రామంలోని రతి మన్మథుడి ఆలయంలో పూజలు నిర్వహిస్తుంటారు. బంగారు ఆభరణాలు కూడా వేసుకుని వీరు మంగళహారుతులు కూడా తీసుకుని ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకుంటుంటారు. ప్రతి హోలీ పౌర్ణమి రోజున ఈ పద్దతి పాటిస్తూ రతి మన్మథుడు తమ కోర్కెలు తీర్చాలని కోరుతుంటారు. వివాహం కాని వారు పెళ్లి కోసం, పెళ్లియిన వారు ఉపాధి కోసం, ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు, అనారోగ్యానికి గురి కావద్దని రతి మన్మథుడిని వేడుకుంటుంటారు. ఈ సందర్భంగా ఆలయంలో వివిధ రకాల పిండివంటలు కూడా పెట్టి స్వామి వారికి నైవైద్యంగా సమర్పిస్తారు. తరతరాలుగా సాగుతున్న ఈ ఆనవాయితీ వల్ల తమకు అంతా మంచే జరుగుతోందని గ్రామస్థులు చెప్తున్నారు. ఈ ఆలయం కూడా మరో ప్రత్యేకతను సంతరించుకుందని చెప్పాలి. సంతేకుళ్లురులో వెలిసిన రతిమన్మథ ఆలయం కూడా అత్యంత అరుదుగా ఉంటాయి. రతి మన్మథులకు ప్రత్యేకంగా ఆలయం నిర్మించిన అరుదైన వాటిల్లో ఈ గ్రామం ఒకటిగా నిలుస్తోంది.

You cannot copy content of this page