పూర్వ విద్యార్థి సంఘం నేతల అపూర్వ కలయిక…

దిశ దశ, జాతీయం:

ఆ నలుగురు ఒకప్పుడు విద్యార్థి సంఘం నాయకులుగా పని చేసిన వారే. ఇప్పుడు వారంత కీలక స్థానాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఒకప్పుడు ఎన్ఎస్ యూఐ నేతలుగా విద్యార్థి ఉద్యమాల్లో క్రీయాశీలకంగా పోషించిన వారు నేడు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో కీలక భూమిక పోషిస్తున్నారు. కేరళలోని కొచ్చిన్ లో జరిగిన ఓ వివాహ వేడుకలకు హాజరైన సందర్భంగా ఒకప్పటి NSUI నాయకులు కలుసుకున్నారు. ఏపీ ఇంఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ చీఫ్ గా వ్యవహరిస్తున్న మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఏపీసీసీ మాజీ అధ్యక్షులు, CWC సభ్యుడు గిడుగు రుద్ర రాజులు కలిసి దిగిన ఫోటో సరికొత్త చర్చకు దారి తీసింది. విద్యార్థి నాయకులుగా కాంగ్రెస్ పార్టీ అనుభంద సంఘంలో దశాబ్దాల క్రిత క్రియాశీలక పాత్ర పోషించిన వీరు అదే కాంగ్రెస్ పార్టీలో కీలక పదవుల్లోకి ఎదిగిన వారు కావడం విశేషం. పార్టీతో అప్పటి నుండి అనుభంధం పెనవేసుకుని ముందుకు సాగుతున్న వీరు అదే పార్టీలో క్రియశీలక బాధ్యతలు నిర్వర్తిస్తుండడం గమనార్హం.

You cannot copy content of this page