telangana: కాకతీయలో విద్యార్థుల కయ్యం… వైరల్ అవుతున్న వీడియోలు..

దిశ దశ, వరంగల్:

వరంగల్ కాకతీయ యూనివర్శిటీలో యుద్ద వాతావరణం నెలకొంది. విశ్వ విద్యాలయంలో జరిగిన గొడవకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో విశ్వ వ్యాప్తమైంది. యూనివర్శిటీ మెస్ లో జూనియర్లు, సీనియర్ల మధ్య నెలకొన్న వివాదం కాస్తా ముష్టి ఘాతుకాలకు, దాడుల వరకు చేరుకుంది. వర్గాలుగా విడిపోయిన విద్యార్థులు పొట్లాడుకున్న తీరు సంచలనంగా మారింది. కారణం ఏదైనా విద్యను ప్రసాదించే విద్యాలయంలోనే విద్యార్థులు గొడవలకు దిగిన తీరు అందరిని విస్మయ పర్చింది. మెస్ నుండి బయటకు వచ్చిన తరువాత కూడా స్టూడెంట్స్ కొట్లాడుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన విషయంలో యూనివర్శిటీ పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. జూనియర్, సీనియర్ల మధ్య ఆధిపత్య పోరుకు మూల కారణం వేరే ఉందన్న ప్రచారం జరుగుతోంది. చదువులమ్మ ఒడిలో భవిష్యత్తును బంగారుమయం చేసుకోవల్సిన విద్యార్థుల మధ్య రచ్చ నెలకొన్న తీరుపై విస్మయం వ్యక్తం అవుతోంది.

You cannot copy content of this page