దిశ దశ, వరంగల్:
కూలీల కష్టంలో పాలు పంచుకుంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న సబ్ రిజిస్ట్రార్ తస్లిమాపై మరో కేసు నమోదు చేశారు అవినీతి నిరోధక శాఖ అధికారులు. ఇటీవల ఔట్ సోర్సింగ్ ఎంప్లాయి ద్వారా రూ. 19, 200 లంచం తీసుకుంటుండగా రెడ్ హైండడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఈ కేసులో అరెస్ట్ అయి జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న తస్లిమాపై ఆధాయానికి మించిన ఆస్తుల కేసు కూడా నమోదు చేశారు. సోమవారం ఖమ్మం ,నల్గొండ, సూర్యాపేటలో సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారుల బృందాలు రూ. 20 కోట్ల వరకు ఆధాయానికి మించిన ఆస్తులను గుర్తించినట్టు సమాచారం. ఆయా చోట్ల దాడులు జరిపినప్పుడు స్వాధీనం చేసుకున్న అధికారులు వాటి విలువను అంచనా వేయడంతో పాటు ఇతర కూడా ఆస్తులు ఉన్నాయా అన్న వివరాలను సేకరిస్తున్నట్టు తెలుస్తోంది.